అన్వేషించండి

IPL 2024: తొలిసారి ప్లే ఆఫ్‌కు చేరకుండా, గుజరాత్‌ పతనం సాగిందిలా

Gujarat Titans: ఈసారి కప్పు లేకుండానే గుజరాత్‌ వెనుదిరిగింది. ప్లే ఆఫ్‌కు అయినా చేరాలన్న గుజరాత్‌ ఆశలపై చివరికి వరుణుడు కూడా నీళ్లు చల్లాడు. 

The journey of Gujarat Titans in IPL 2024: ఐపీఎల్‌(IPL)లో అత్యంత విజయవంతైమన జట్టుగా ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌(GT)...ఈసారి కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకోకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 2022 సీజన్‌లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌... మొదటి సీజన్‌లోనే అదరగొట్టింది. హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) సారథ్యంలో తొలిసారే ఐపీఎల్‌ టైటిల్‌ను ఒడిసిపట్టి చరిత్ర సృష్టించింది. 2022 సీజన్‌ ఫైనల్స్‌లో  రాజస్థాన్ రాయల్స్‌(RR)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2023 సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనతో గుజరాత్‌ ఆకట్టుకుంది. ఆ సీజన్‌లోనూ హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన గుజరాత్‌... ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైనా అద్భుత పోరాటంతో ఆకట్టుంది. 2023 సీజన్‌ మొత్తం సాధికార ఆటతీరుతో గుజరాత్‌ ముందుకు సాగింది. హార్దిక్‌ పాండ్యా జట్టును గొప్పగా ముందుకు నడిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వీడి ముంబై(MI) పంచన చేరడం.. మహ్మద్‌ షమీ గాయంతో దూరం కావడం... గిల్(Gill) తొలిసారి సారధ్య బాధ్యతలు స్వీకరిచడం సహా కొన్ని అవరోధాలతో ఈసారి కప్పు లేకుండానే గుజరాత్‌ వెనుదిరిగింది. ప్లే ఆఫ్‌కు అయినా చేరాలన్న గుజరాత్‌ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 

 
మూడో జట్టుగా గుజరాత్‌
ఐపీఎల్‌ సీజన్ 2024లో ప్లే ఆఫ్‌కు చేరకుండా వెనుదిరిగిన మూడో జట్టుగా గుజరాత్ నిలిచింది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గుజరాత్‌ బాధతో ఐపీఎల్ సీజన్‌ నుంచి నిష్క్రమించింది. మే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 13 మ్యాచులు ఆడిన గుజరాత్‌ కేవలం అయిదు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. మరో ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే రద్దైంది. దీంతో కేవలం 11 పాయింట్లతో ఉన్న గుజరాత్‌ ఐపీఎల్‌ నుంచి ప్లే ఆఫ్‌ చేరకుండానే వెనుదిరిగింది. ఈ సీజన్‌ను గుజరాత్ సానుకూలంగా ప్రారంభించింది. కానీ ఆ సానుకూలతను టోర్నీ మొత్తం కొనసాగించడంలో విఫలమైంది. ఈ మెగా టోర్నీలో గుజరాత్‌ వరుస పరాజయాలతో సతమతమైంది. 
 
అందరికీ అభినందనలు
ఈ సీజన్‌లో తమకు మద్దతు ఇచ్చినందుకు అభిమానులకు గుజరాత్‌ టైటాన్స్‌ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. మే 16న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. హైదరాబాద్‌పై గెలిచినా గుజరాత్‌కు కేవలం 13 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. మరోవైపు ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా మిగిలిన రెండు స్థానాల కోసం అయిదు జట్లు పోరాడుతున్నాయి. హైదరాబాద్‌, చెన్నైకు ప్లే ఆఫ్‌ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన జట్లకూ అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget