IPL2024: గర్జిస్తేనే "రాహుల్" గ్రహణం వీడేది! లేకుంటే మోయే మోయే...
SRH vs LSG, IPL2024 : ఈ కీలక మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో, హైదరాబాద్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. రెండు జట్లూ సమాన పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాయి.
SRH vs LSG Head to head Records: ఆడిన మ్యాచులు... గెలిచిన మ్యాచులు... ఓడిన మ్యాచులు అన్ని సమానంగా ఉన్న రెండు జట్లు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుని... ఒక అడుగు ముందుకు వేసేందుకు కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. హైదరాబాద్(Hyderabad) వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో, హైదరాబాద్ జట్లు పట్టుదలగా ఉన్నాయి. రెండు జట్లూ సమాన పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు జట్లు తమ తమ చివరి మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాయి. లక్నో జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో 98 పరుగుల తేడాతో భారీ ఓటమిని ఎదుర్కొంది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కడంతో హైదరాబాద్ కూడా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఐపీఎల్ చరిత్రలో క్నో సూపర్ జెయింట్స్... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడుసార్లు హైదరాబాద్‌పై లక్నోనే గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ విజయం సాధిస్తే వారికే ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
పిచ్ రిపోర్ట్
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉంటుంది. బ్యాటర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్‌లో పరుగులు సులువుగా వస్తాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంటుంది.
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, అన్మోల్‌ప్రీత్ సింగ్ .
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరాక్ మన్కడ్, అర్షద్ ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.