By: ABP Desam | Updated at : 25 Apr 2022 09:49 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అర్థ సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న శిఖర్ ధావన్ (Image Credits: IPL)
భారత స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఐపీఎల్‌లో ఆరు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. భారత మాజీ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ మైలు రాయిని మొదట అందుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్ ధావన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఇది శిఖర్ ధావన్‌కు 200వ ఐపీఎల్ మ్యాచ్ కూడా కావడం విశేషం. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు శిఖర్ ధావన్ 5,998 పరుగులతో ఉన్నాడు. రెండు పరుగులను దాటగానే శిఖర్ ధావన్ అరుదైన ఆరు వేల పరుగుల మార్కును దాటుకుని విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.
దీంతోపాటు 200వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా కూడా శిఖర్ ధావన్ (88 నాటౌట్: తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ (68) పేరు మీద ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా శిఖర్ ధావన్ అధిగమించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో శిఖర్ ధావన్ (88 నాటౌట్: తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) నిలిచాడు. మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 6.402 పరుగులను సాధించగా... ప్రస్తుతం శిఖర్ ధావన్ పరుగుల వద్ద ఉన్నాడు. రోహిత్ శర్మ (5,764), డేవిడ్ వార్నర్ (5,668), సురేష్ రైనా (5.538)... మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నారు.
IPL 2022, Qualifier 1 Preview: ఫైనల్స్ మొదటి బెర్త్ ఎవరిది? - టైటాన్స్, రాయల్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి?
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
SRH Vs PBKS: తడబడ్డ సన్‌రైజర్స్ - పంజాబ్ ముందు ఈజీ టార్గెట్!
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Quad Summit 2022: భారత్, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో