By: ABP Desam | Updated at : 06 Apr 2023 04:33 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సంజూ శాంసన్
Sanju Samson IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో సంజూ శాంసన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే లెజెండ్స్ సరసన నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. అజింక్య రహానె రికార్డును వెనక్కి నెట్టేశాడు. బర్సాపార స్టేడియంలో బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో సంజూ 25 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. దీంతో అతడు ఆల్‌టైమ్ టాప్ రన్ గెట్టర్ లిస్టులో చేరిపోయాడు.
𝐃𝐢𝐥 𝐬𝐞 𝐑𝐨𝐲𝐚𝐥 𝐬𝐢𝐧𝐜𝐞 𝐝𝐚𝐲 𝟏. 💗 pic.twitter.com/Thy5l7Jhzc
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2023
ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ శాంసన్ 118 మ్యాచులు ఆడాడు. 30.46 సగటు, 138 స్ట్రైక్‌రేట్‌తో 3138 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతకు ముందు ఆర్‌ఆర్‌కు అజింక్య రహానె 106 మ్యాచుల్లో 35.60 సగటు, 122.30 స్ట్రైక్‌రేట్‌తో 3098 రన్స్ సాధించాడు. షేన్ వాట్సన్, జోస్ బట్లర్, రాహుల్ ద్రవిడ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
సంజూ శాంసన్ 2013 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. అరంగేట్రం నుంచే సత్తా చాటాడు. ద్రవిడ్ నాయకత్వంలో దాటుదేలాడు. ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ గెలిచింది రాజస్థాన్. ఆ తర్వాత 2013లో ద్రవిడ్ కెప్టెన్సీలో ప్లేఆఫ్ చేరింది. రెండేళ్లు జట్టును నిషేధించడంతో సంజూను దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అక్కడా అదరగొట్టాడు. 2018 వేలంలో శాంసన్‌ను రాజస్థాన్ తిరిగి దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్‌తో పోటీపడి మరీ రూ.8 కోట్లు చెల్లించింది. 2021లో స్టీవ్ స్మిత్ నుంచి అతడు కెప్టెన్సీ తీసుకున్నాడు. 2022లో ఏకంగా రన్నరప్‌గా నిలబెట్టాడు. 2008 తర్వాత తొలిసారి ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
Life update: Sanju Samson overtakes Ajinkya Rahane to become our leading run-getter. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2023
రాజస్థాన్ రాయల్స్ ఆల్‌టైమ్ టాప్ స్కోరర్లు
సంజూ శాంసన్ : 3138 పరుగులు (118 మ్యాచులు)
అజింక్య రహానె: 3098 పరుగులు (106 మ్యాచులు)
షేన్ వాట్సన్ : 2474 పరుగులు (84 మ్యాచులు)
జోస్ బట్లర్ : 2378 పరుగులు (60 మ్యాచులు)
రాహుల్ ద్రవిడ్ : 1324 పరుగులు (52 మ్యాచులు)
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షిమ్రన్ హిట్‌మేయర్ (36: 18 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ధ్రువ్ జోరెల్ (32 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ (86 నాటౌట్: 56 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Nothing but just Halla Bol from this man. 🔥🔥🔥 pic.twitter.com/4IOY8AqJsu
— Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2023
IPL 2023 Winner: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం - వైరల్ అయిన గూగుల్ సీఈఓ ట్వీట్
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?