అన్వేషించండి

Sanju Samson Joins Elite IPL List: సంజు శాంసన్ సంచలనం.. కోహ్లీ, కేఎల్ రాహుల్ సరసన చేరిక.. తన ఖాతాలో అరుదైన రికార్డు! 

ఐపీఎల్ 2026లో సంజు శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు.

Sanju Samson Joins Elite IPL List After Heroics vs DC: ఐపీఎల్ 2026 సీజన్ లో సంజు శాంసన్ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన మ్యాచ్ లో 87 పరుగులతో అజేయంగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లీగ్ లో నెలకొల్పిన ఒక ఎలైట్ లిస్ట్ లో సంజు కూడా చేరిపోయాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ నుండి ఏకంగా రూ. 18 కోట్లకు సీఎస్‌కేకు ట్రేడ్ అయిన సంజు, తనపై పెట్టిన నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకుంటున్నాడు.

రికార్డుల వేటలో సంజు శాంసన్..
ఢిల్లీ క్యాపిటల్స్ పై మంగళవారం జరిగిన మ్యాచ్ లో సంజు కేవలం 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో ఒకే ప్రత్యర్థిపై రెండుసార్లు 100 కి పైగా పరుగుల పార్టనర్‌షిప్స్‌ లో భాగమైన ఏకైక బ్యాటర్ గా సంజు చరిత్ర సృష్టించాడు. అంతకుముందు చెన్నైలో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీపై 115 పరుగులతో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఈ సీజన్ లో కేవలం ఢిల్లీపైనే సంజు ఏకంగా 202 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో ఒకే టీమ్ పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ గా సంజు నిలిచాడు.

టాప్ 5 రికార్డులు ఇవే:

209 - విరాట్ కోహ్లీ vs గుజరాత్ లయన్స్ (2016)

206 - కేఎల్ రాహుల్ vs ముంబై ఇండియన్స్ (2022)

202 - సంజు శాంసన్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (2026)

196 - క్రిస్ గేల్ vs పూణే వారియర్స్ (2013)

193 - కేఎల్ రాహుల్ vs ఆర్సీబీ (2020)

ఆరెంజ్ క్యాప్ రేసులో..
ప్రస్తుతం సంజు శాంసన్ ఆరెంజ్ క్యాప్ కోసం గట్టి పోటీ ఇస్తున్నాడు. 10 మ్యాచుల్లో 57.42 యావరేజ్ తో 402 పరుగులు చేసి టాప్-5 స్కోరర్ల జాబితాలో ఉన్నాడు. అతని నిలకడైన ఆటతీరు సీఎస్‌కే బ్యాటింగ్ కు పెద్ద బలంగా మారింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ పర్యవేక్షణలో సంజు తన బ్యాటింగ్ శైలిని మరింత మెరుగుపరుచుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ప్లేఆఫ్స్ రేసులో సీఎస్‌కే..
ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీని అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ తమ బౌలింగ్ తో 155 పరుగులకే కట్టడి చేశారు. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. ఢిల్లీ బ్యాటర్లలో సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ కాసేపు పోరాడినా, మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టు 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

విజయతీరాలకు చేర్చిన సంజు, కార్తీక్..
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కేకు సంజు శాంసన్ వెన్నెముకగా నిలిచాడు. కార్తీక్ శర్మతో కలిసి అజేయంగా 114 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పి మ్యాచ్ ను 17.3 ఓవర్లలోనే ముగించాడు. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి. సంజు ఫామ్ ఇలాగే కొనసాగితే సీఎస్‌కే రికార్డు స్థాయిలో ఆరోసారి కప్పు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget