IPL 2024: ఐపీఎల్‌లో అలాంటి జట్టే లేదు, వార్న్ మహా మేధావి అన్న రోహిత్
Rohit Sharma: ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైందేనని అభిప్రాయపడ్డాడు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఐపీఎల్ లో ప్రతి జట్టు తీవ్రమైన పోటీనిస్తోందని తెలిపాడు.
Rohit Sharma says there are no weak franchises in T20 tournament: ఐపీఎల్(IPL)లో జట్ల బలాబలాలపై ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైందేనని అభిప్రాయపడ్డాడు. పదేళ్లుగా ఐపీఎల్ ఎంతో పురోగతి సాధించిందని... ప్రతి జట్టు తీవ్రమైన పోటీనిస్తోందని తెలిపాడు. ఐపీఎల్‌లో బలహీనమైన జట్టేది లేదని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి సరైన ఆటగాళ్లనే ప్రాంఛైజీలు తమ జట్లలోకి తీసుకుంటున్నాయని రోహిత్ తెలిపాడు. దివంగత షేన్‌వార్న్‌ది అద్భుతమైన క్రికెట్ బుర్ర అని... క్రికెట్ గురించి విభిన్న కోణాల్లో ఆలోచించేవాడని రోహిత్ తెలిపాడు. డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడేటప్పుడు తాను గిల్‌క్రిస్ట్‌తో కలిసి ఆడానని.. వార్న్ ఎంతటి ఉత్తమ ఆటగాడో గిల్ తనకు చెప్పేవాడని రోహిత్ తెలిపాడు. వ్యాఖ్యతగా ఉన్నప్పుడు కూడా తర్వాతి రెండు లేదా మూడు బంతుల్లో ఏం జరుగుతుందో వార్న్ అంచనా వేసేవాడని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.
రిటైర్‌మెంట్‌పై ఇలా...
తాను వన్డే ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నానని రోహిత్ శర్మ తేల్చి చెప్పాడు. ఆటకు ఇప్పుడే గుడ్ బై చెప్పాలని అనుకోవట్లేదని ఓ యూ ట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనుందని పరోక్షంగా వెల్లడించాడు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రోహిత్.. వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేకపోయాడు. ప్రస్తుతం నా రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని.. జీవితం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదన్నాడు. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నానని.. వన్డే ప్రపంచకప్ గెలవాలనుందని రోహిత్ తెలిపాడు. 2025లో లార్డ్స్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగుతుందని.. అక్కడి వరకు కచ్చితంగా వెళ్తామని హిట్‌మ్యాన్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో తాము మెరుగ్గానే ఆడామని రోహిత్ తెలిపాడు. సెమీస్ గెలిచినప్పుడు కప్‌నకు మరో అడుగు దూరంలోనే ఉన్నామని అనుకున్నానని. కానీ ఫైనల్లో తమ ఓటమికి ఒక్క కారణం కూడా కనిపించలేదని రోహిత్ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అందరికీ ఓ చెడు రోజంటూ ఉంటుందని.... మంచి క్రికెట్ ఆడినా, ఆత్మవిశ్వాసంతోనే ఉన్నా ఆ ఫైనల్ మనది కాని ఓ రోజుగా మిగిలిపోయిందన్నాడు.
అలా అనిపిస్తేనే...
రిటైర్‌మెంట్ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ... టీమిండియా(England) సారధి రోహిత్ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోనని, ఇక చాలని అనిపించిన రోజు వెంటనే రిటైరవుతానని తేల్చి చెప్పాడు. దినేశ్ కార్తీక్‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తానొక రోజు నిద్ర లేవగానే.. ఇ ఆటకు సరిపోను అనిపిస్తే వెంటనే నేను దాని గురించి మాట్లాడతానని రోహిత్ తెలిపాడు.