Rinku Singh: ఎంత మంచివాడవయ్యా రింకూ, మనసు దోచేసిన నయా స్టార్
IPL 2024 - Rinku Singh: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆటగాడు రింకు సింగ్ ఓ టీనేజ్ క్రికెటర్‌కు క్షమాపణలు చెప్పాడు.పొరపాటు జరిగింది క్షమించమన్నాడు.
Rinku Singhs six hit young cricketer as batter apologizes with a signed cap: మరో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలబడుతుంది. ఆటగాళ్ళు ప్రాక్టీస్ లో తలమునకలు అవుతున్నారు. టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) కూడా అదే పనిలో ఉన్నాడు. ఉత్సాహంగా 2024 ఐపీఎల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రస్తుతం అతడు ముంబయిలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ క్యాంప్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
టీం ఇండియా నయా ఫినిషర్ సిక్సులను అలవోకగా బాదేస్తాడని మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు అతను సిక్సర్ ఓ పిల్లాడిని ఇబ్బంది పెట్టింది. నెట్స్ సెషన్‌లో రింకూ ప్రాక్టీస్ చేస్తూ ఒక బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఈ బంతి కాస్త బౌండరీ వెలుపల ఉన్న బాలుడికి తగిలింది. దీంతో రింకూ సింగ్ ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి.. ఆ బాలుడితో కాసేపు మాట్లాడాడు. ఓ క్యాప్ ఇచ్చి ఇంకాఆ ఏమన్నా కావాలా, మరీ గట్టిగా తగాలలేదు కదా అని అడిగాడు. దానికి ఆ బాలుడు తనకు రింకూ ఆటోగ్రాఫ్ కావాలని అడగటంతో సంతకం చేసిన టోపీని అతనికి బహుమతిగా ఇచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
కోల్‌కత్తాకు షాక్
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు షాక్ తగిలింది. KKR ఆటగాడు జేసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం అవుతున్నాడు. దీంతో జేసన్‌రాయ్ స్థానంలో కొల్‌కత్తా ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వస్తున్నాడని ప్రకటించింది. రిజర్వ్ ధర రూ.1.50 కోట్లకు కేకేఆర్ తీసుకుంది. ఫిలిప్‌కిది ఐపీఎల్‌లో రెండో సీజన్. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన ఫిలిప్ 9 మ్యాచ్‌లు ఆడి 218 పరుగులు చేశాడు.