RCB vs KKR Weather Report: బెంగళూరులో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్.. చిన్నస్వామి పిచ్ రిపోర్టు, వెదర్ అనుకూలమేనా?
IPL 2025 KKR vs RCB Weather Update: ఐపీఎల్ 2025లో భాగంగా 58వ మ్యాచ్ లో RCB, KKR తలపడుతున్నాయి. చిన్నస్వామి వేదికగా బెంగళూరు, కోల్ కతా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.

RCB vs KKR, IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేడు రీస్టార్ట్ అవుతోంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ తాత్కాలికంగా నిలిపివేశారు. మే 17, శనివారం రాత్రి IPL 2025 మళ్ళీ ప్రారంభమవుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. RCB, KKR మ్యాచ్ టాస్ రాత్రి 7 గంటలకు వేయగా, మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. వర్షం పడి ఈ మ్యాచ్ రద్దు అయితే కేకేఆర్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్లే. ఈ మ్యాచ్ ఓడినా ఆర్సీబీకి వచ్చే నష్టమేమీ లేదు. మిగతా మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాలి.
హెడ్ టు హెడ్‌లో ఎవరు ఎన్ని గెలిచారు
RCB, KKR మధ్య ముఖాముఖీ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. కేకేఆర్ జట్టు బెంగళూరును IPLలో 20 సార్లు ఓడించింది. అదే RCB జట్టు కోల్‌కతాను లీగ్ చరిత్రలో 15 సార్లు ఓడించింది. అంటే 5 మ్యాచ్‌లు కేకేఆర్ అధికంగా గెలిచి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరగగా... అందులో 8 మ్యాచ్‌లలో KKR గెలుపొందింది.
చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్ బౌలర్లకు అంతగా కలిసిరాదు. ఇక్కడ బ్యాట్స్‌మెన్‌లకు ఎంతో అనుకూల మైన పిచ్ ఉంటుంది. ఈ మైదానంలో పలు హై స్కోరింగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఈరోజు మ్యాచ్‌లో పిచ్ బౌలర్లకు సహాయపడే అవకాశం ఉంది, ఎందుకంటే గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా పిచ్ కవర్స్‌తో కప్పి ఉంచారు. అది ఫాస్ట్ బౌలర్లకు హెల్పయ్యే అవకాశం ఉంది. బంతి అంచనా వేయడంలో బ్యాటర్లు కొంచెం ఇబ్బంది పడతారు.
The highly awaited and our favourite day, 𝓜𝓐𝓣𝓒𝓗 𝓓𝓐𝓨 is here! 🤩
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 17, 2025
Catch the LIVE action on @JioHotstar from 7:30 PM onwards. 🙌🎥#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/c9aBdyxxVF
మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగిస్తుందా..
బెంగళూరులో శనివారం ( మే 17న) వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, శనివారం వర్షం పడే అవకాశం 65 శాతం ఉంది. గత వారం బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. మ్యాచ్ సమయంలో జల్లులు పడే అవకాశం ఉంది. బెంగళూరును ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మేశాయి. అయితే సాధారణ వర్షం పడి గ్యాప్ ఇచ్చినా, చిన్నస్వామిలో ఉన్న టెక్నాలజీ కారణంగా స్టేడియం ఈజీగా డ్రై అవుతుంది.
RCB ప్లేయింగ్ ఎలెవెన్ అంచనా- ఫిల్ సాల్ట్/జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, మయంక్ అగర్వాల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, యశ్ దయాల్
ఇంపాక్ట్ ప్లేయర్- సుయాష్ శర్మ
Bravo dishes out must-try food from back home🍴💜
— KolkataKnightRiders (@KKRiders) May 17, 2025
Catch the full episode of Prestige presents Knight Bite only on YouTube and Knight club app📱
🔗https://t.co/tSRrzj5abc pic.twitter.com/b8By03OqVj
KKR ప్లేయింగ్ ఎలెవెన్ అంచనా- సునీల్ నరైన్, రెహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశి, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రె రస్సెల్, రమన్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి
ఇంపాక్ట్ ప్లేయర్- హర్షిత్ రాణా





















