IPL 2024: రికార్డుల్లో శాంసన్ సేనదే పైచేయి
PBKS vs RR: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్‌తో 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ 15 మ్యాచుల్లో విజయం సాధించగా... పంజాబ్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది.
PBKS vs RR IPL 2024 Head to head records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024లో 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(PBKS)తో రాజస్థాన్ రాయల్స్(RR) తలపడనుంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ అప్రతిహాత విజయాలకు గత మ్యాచ్‌లో గుజరాత్ బ్రేక్ వేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్ చూస్తోంది. ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ నాలుగు విజయాలు, ఎనిమిది పాయింట్లు, +0.871 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా, రెండు విజయాలు, మూడు ఓటములు సాధించింది. నాలుగు పాయింట్లు, నెట్ రన్ రేట్ -0.196తో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
హెడ్ టు హెడ్ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్‌తో 26 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ 15 మ్యాచుల్లో విజయం సాధించగా... పంజాబ్ 11 మ్యాచుల్లో విజయం సాధించింది. గత అయిదు మ్యాచుల్లో రాజస్థాన్ మూడు మ్యాచుల్లో విజయం సాధించగా.... పంజాబ్ రెండు మ్యాచుల్లో గెలిచింది. 2023లో జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌లో రాజస్థాన్ అత్యధిక స్కోరు 226 పరుగులు కాగా.... పంజాబ్ అత్యధిక స్కోరు 223 పరుగులు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ అత్యల్ప స్కోరు 124కాగా... రాజస్థాన్ అత్యల్ప స్కోరు 112. ఈ రెండు జట్లు జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ అత్యధిక పరుగులు సాధించాడు. శాంసన్ 596 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు కూడా సంజు శాంసన్ పేరు మీదే ఉంది. శాంసన్ పంజాబ్‌పై 119 పరుగులు చేశాడు. చాహల్ నాలుగు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Watch:
పిచ్ రిపోర్ట్
పంజాబ్-రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలోని మొహాలీ పిచ్‌పై జరగనుంది. భారత్‌లో అత్యంత వేగవంతమైన పేస్ పిచ్‌లలో ఇదీ ఒకటి. ఈ పిచ్‌పై పేసర్లకు అదనపు బౌన్స్ అందిస్తుంది. కొత్త బంతిని ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడతారు. మంచు ఆటను ప్రభావితం చేస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ సాధారణంగా ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాడు.
జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డొనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర ఖాన్ చాహల్, అవేశ్వేంద్ర ఖాన్ చాహల్, , రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.