PBKS vs LSG Record Score: ధర్మశాలలో రికార్డు స్కోర్ చేసిన పంజాబ్ కింగ్స్, మరి లక్నో ఛేదిస్తుందా ?
LSG vs PBKS Record Score | ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ రికార్డు స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.

IPL 2025 LSG vs PBKS Record Score | ధర్మశాల: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 236 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. పంజాబ్ ఓపెనర్ ప్రభసిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91 పరుగులు, 6 ఫోర్లు, 7 సిక్సర్లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45 పరుగులు, 4 ఫోర్లు, సిక్సర్లు) రాణించారు. చివర్లో శశాంక్ సింగ్, స్టోయినిస్ మెరుపులతో ధర్మశాల వేదికలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది.
తొలి ఓవర్లోనే షాక్..
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఆకాష్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 5వ బంతికి ప్రియాన్ష్ ఆర్య (1) ఔటయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్, మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించారు. ఈ క్రమంలో జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 4 సిక్సర్లు)ను సైతం ఆకాష్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఇంగ్లీస్ ఆడిన బంతిని డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రబ్ సిమ్రన్ సింగ్ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో వీర విహారం చేశారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 4, 2025
A mountainous batting effort by #PBKS ❤️ #LSG's chase underway 🔜
Scorecard ▶ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG pic.twitter.com/gMM8nAUx6V
రాణించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్..
స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాడు. స్పిన్నర్ దిగ్వేష్ రాఠి బౌలింగ్ లో అయ్యర్ (25 బంతుల్లో 45 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడిన బంతిని యాదవ్ క్యాచ్ పట్టడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే రన్ రేట్ తగ్గకుండా ఆడారు. అప్పటికి పంజాబ్ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. నేహాల్ వదేరా (16) త్వరగా ఓటైనా.. శశాంక్ సింగ్ తో కలిసి ప్రబ్ సిమ్రన్ లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ర్యాంప్ షాట్లతో పాటు టెక్నిక్ వాడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆవేష్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టారు.
ప్రబ్ సిమ్రన్ సెంచరీ మిస్
భారీ ఇన్నింగ్స్ ఆడిన ప్రబ్ సిమ్రన్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రివర్స్ షాట్ ఆడేందుకు యత్నించగా థర్టీ యార్డ్ సర్కిల్ లో నికోలస్ పూరన్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. చివర్లో శశాంక్ సింగ్ 4 ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో రెండు వందల మార్క్ చేరింది. మార్కస్ స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్), శశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ధర్మశాలలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్, దిగ్వేష్ రాఠీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. పంజాబ్ ఇచ్చిన టార్గెట్‌ను లక్నో ఛేదిస్తే కనుక లీగ్ చరిత్రలో హయ్యస్ట్ ఛేజింగ్ లలో ఒకటిగా నిలుస్తుంది.





















