Viral Photo: అంపైర్లకు షాకిచ్చిన ధోనీ.. బ్యాట్ కొలతపై సందిగ్ధత.. ఆర్సీబీతో మ్యాచ్ లో ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
ఈ మధ్య బ్యాట్ కొలతల విషయంలో అంపైర్లు చాలా స్ట్రిక్టుగా ఉంటున్నారు. ఒక గేజ్ ను తీసుకుని బ్యాటర్ల బ్యాట్లను పరిశీలిస్తున్నారు. ఈ టెస్టును పాస్ అయితేనే బ్యాట్ ను వాడేందుకు అనుమతిస్తున్నారు.

IPL 2025 RCB VS CSK, MS Dhoni Bat: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 2 పరుగులతో ఆర్సీబీ గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 62, 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటాడు. మతీషా పతిరాణకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే (48 బంతుల్లో 94, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. లూంగీ ఎంగిడి మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే చెన్నై ఛేజింగ్ లో టైంలో డెవాల్డ్ బ్రివిస్ డకౌట్ అయ్యాక అతని స్థానంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు. అప్పుడు ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది.
#IPL2025 #IPL #IPLonJioStar
— PRADEEP CRICINFO (@PradeepCricInfo) May 3, 2025
DHONI SAID - MY BAT IS FINE#Dhoni #Jadeja #ayushmhatre #romarioshepherd #romario #RCBvsCSK #CSKvsRCB #Bhuvi #Pathirana #patidar #ViratKohli #ViratKohli𓃵 #MSD #Kohli #virat #Chennai #ChennaiSuperKings #khaleel pic.twitter.com/Ask4r06EEb
కొత్త రూల్..
ఈ ఎడిషన్ నుంచి బంతికి, బ్యాట్ కు మధ్య పోరు ఉండేలా ఐపీఎల్ యాజమాన్యం కొన్ని నిబంధనలు చేపట్టింది. అందులో భాగంగా, బ్యాట్ కొలతలు నిర్దేశించిన పరిమాణంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ బ్యాట్ ను అంపైర్లు పరిశీలించారు. అయితే ధోనీ కూడా అందుకు పూర్తిగా సహకరించాడు. తన బ్యాట్ ను ఎత్తి పట్టుకుని కొలతలు తీసుకునేందుకు సహకారం అందించాడు. అయితే ఆ గేజ్ టెస్టులో బ్యాట్ కొస్త విఫలమైంది. ఈ క్రమంలో కాస్త సందిగ్ధత నెలకొంది. దీంతో ధోనీ గేజ్ ను తీసుకుని పరిశీలించాడు. అయిత కాసేపపు తర్జన భర్జన తర్వాత అంపైర్లు ఆ బ్యాట్ ను ఉపయోగించుకునేందుకు అనుమతిచ్చారు. తాజాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు వైరల్ చేస్తున్నారు.
అభిమానులకు నిరాశ..
ఇక ఈ సీజన్ లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై అభిమానులను నిరాశ పరుస్తోంది. ఆర్సీబీతో గెలిచే మ్యాచ్ లో కూడా విఫలమై రెండు పరుగులతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా, కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. దీంతో ఈ సీజన్ లో రెండుసార్లు ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. ఇక ఇప్పటికే ఈ టోర్నీ నుంచి చెన్నైతోపాటు రాజస్థాన్ కూడా నాకౌట్ అయింది. ఏడు పరాజయాలతో మాజీ చాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా నాకౌట్ అంచున నిలిచింది. తాజాగా చెన్నైపై విజయంతో 16 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్ ను ఆర్సీబీ దక్కించుకుంది. మరొక్క విజయం సాధించగలిగితే ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.




















