IPL 2025 KKR vs RR: రాణించిన రఘువంశీ, హాఫ్ సెంచరీతో మెరిసిన రస్సెల్.. రాజస్తాన్ ముందు బిగ్ టార్గెట్
రాజస్తాన్ రాయల్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి భారీ టార్గెట్ ఇచ్చింది.

KKR vs RR Match Updates: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రఘువంశీ (44), కెప్టెన్ రహానే (30), ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (35) పరవాలేదనిపించారు. చివర్లో రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా 200 పరుగుల మార్క్ దాటింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుద్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. ఆకాష్ మద్వాల్ వికెటేమీ తీయకుండానే 50 పరుగులు సమర్పించుకున్నాడు.
కేకేఆర్ టీం చివరి 5 ఓవర్లలో విజృంభించింది. ఎంతలా అంటే కేవలం ఐదు ఓవర్లలో కేకేఆర్ బ్యాటర్లు 85 పరుగులు రాబట్టారు. ఇందులో చివరి రెండు ఓవర్లలో 35 పరుగులు వచ్చాయి.
టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టుకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. యుద్వీర్ సింగ్ బౌలింగ్ లో సునీల్ నరైన్ (11) బౌల్డయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే, మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాత్ (25 బంతుల్లో 35 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్స్) కలిసి స్కోరు బోర్డును నడిపంచాడు. 56 పరుగుల భాగస్వామ్యం తరువాత గుర్బాజ్ ను స్పిన్నర్ తీక్షణ ఔట్ చేశాడు. ఆపై రఘువంశీతో కలిసి రహానే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. కానీ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రహానే (30) రియాన్ పరాగ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచిచ్చి ఔటయ్యాడు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) May 4, 2025
A big final flourish from Andre Russell helps #KKR get 8️⃣5️⃣ from the last 5 overs and set a 🎯 of 2️⃣0️⃣7️⃣ 🔥#RR's reply coming up 🔜
Scorecard ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR pic.twitter.com/GOaqsj92Aj
రస్సెల్ పవర్ హిట్టింగ్..
రస్సెల్ బ్యాటింగ్ కు రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. 170, 180 చేస్తుందా లేదా అనుకున్న జట్టు రెండు వందలపైగా పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ ఓవర్లో రస్సెల్ ఫోర్ సిక్సర్ కొట్టగా, రఘువంశీ ఫోర్ కొట్టాడు. తీక్షణ బౌలింగ్ లో రస్సెస్ హ్యాట్రిక్ సిక్సర్లు ఇన్నింగ్స్ కే హైలైట్. జోఫ్రా ఆర్చర్ వేసిన మరో ఓవర్లోనే రస్సెల్ సిక్స్, ఫోర్ కొట్టి పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో రస్సెస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివర్లో రఘువంశీ (31 బంతుల్లో 44 పరుగులు, 5 ఫోర్లు)ని జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. ఆపై చివరి చివర్లో రింకూ సింగ్ (6 బంతుల్లో 19 నాటౌట్) ఓ బౌండరీ, రెండు సిక్సర్లు బాదడంతో కోల్‌కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 206 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ గెలిస్తే కోల్‌కతా రైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు రాజస్థాన్ ఈ మ్యాచ్ గెలిచినా ప్రయోజనం లేదు. రాజస్థాన్ ఇదివరకే ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిపోయింది. కోల్‌కతా పరిస్థితి సైతం ఏం బాగోలేదు. టాప్ జట్లు భారీ విజయాలతో తొలి 4 స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. కేకేఆర్ ప్లే ఆఫ్ అంత ఈజీ కాదు.





















