IPL 2025 KKR VS RR Result Update: కేకేఆర్ స్టన్నింగ్ విక్టరీ.. కీలకదశలో రాజస్థాన్ ను నిలువరించిన డిఫెండింగ్ చాంపియన్.. పరాగ్ పోరాటం వృథా
కీలకమ్యాచ్ లో కేకేఆర్ సత్తా చాటింది. రాయల్స్ తో మ్యాచ్ లో కీలకదశలో సత్తా చాటి, విజయం సాధించింది. దీంతో 11 పాయింట్లతో టాప్-6కు చేరుకుంది. పరాగ్ ఒంటరి పోరాటం జట్టును గెలిపించ లేక పోయింది.

IPL 2025 KKR 5th win: ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఆడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ సత్తా చాటింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగుతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. తాజా ఫలితంతో పాయింట్ల పట్టికలో ఆరో ప్లేస్ కు ఎగబాకిన కేకేఆర్, 11 పాయింట్లతో నిలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. అండ్రీ రసెల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (25 బంతుల్లో 57 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) తో సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్ లో రాయల్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (45 బంతుల్లో 95, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తో చివరి కంటా నిలిచి, జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, పొదుపుగా బౌలింగ్ చేశాడు.
A vintage Andre Russel show at Eden Gardens 🔥🔥
— Kashif (@cricstate) May 4, 2025
pic.twitter.com/Y0lhYSHLZj
రస్సెల్ జోరు..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఆల్ రౌండర్ సునీల్ నరైన్ (11) త్వరగానే ఔటయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (35), కెప్టెన్ అజింక్య రహానే (30) ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ, నెమ్మదిగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో రెండో వికెట్ కు 56 పరుగులు జోడించారు. ఆ తర్వాత గుర్భాజ్ ఔటైనా..అంగ్ క్రిష్ రఘువంశీ (44) ధాటిగా ఆడాడు. రహానే యాంకర్ ఇన్నింగ్స్ తో అలరించి, కాసేపటికి ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన రసెల్ విజృంభించి ఆడాడు. పది బౌండరీలతో పర్యాటక బౌలర్లను చితక్కొట్టాడు. మరో ఎండ్ లో రఘువంశీ కూడా ధాటిగా ఆడాడు. ఈ నేపథ్యంలో 22 బంతుల్లోనే రసెల్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో రఘువంశీ ఔటైనా, రింకూ సింగ్ (19 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
Riyan Parag smashes 6 consecutive sixes in 6 balls🔥
— MensXP (@MensXP) May 4, 2025
Stellar innings or 95 (45) pic.twitter.com/bIhbeugDVp
పరాగ్ ఒంటరి పోరాటం..
తనను రిటైన్ చేసుకున్నందుకుగాను ఈ మ్యాచ్ లో అందుకు తగ్గ ఫలితాన్ని ఈ మ్యాచ్ పరాగ్ చూపించాడు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్స్ కు శుభారంభం దక్కలేదు. వరుస విరామాల్లో వైభవ్ సూర్యవంశీ (4), కునాల్ సింగ్ రాథోడ్ డకౌట్, ధ్రువ్ జురెల్ డకౌట్, వనిందు హసరంగా డకౌట్ తోపాటు ఫామ్ లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ (34) ఔటవడంతో 71 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ ను మలుపు తిప్పే భాగస్వామ్యాన్ని పరాగ్, షిమ్రాన్ హిట్ మెయర్ (29) నమోదు చేశారు. హిట్ మెయర్ నెమ్మదిగా ఆడి యాంకర్ రోల్ పోషించగా, పరాగ్ మాత్రం డాషింగ్ బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే తను ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఇక భాగస్వామ్యం కూడా పెరిగి, రాయల్స్ మ్యాచ్ లోకి వచ్చింది. అయితే గేర్ మర్చి హిట్టింగ్ కు దిగుదామనే తరుణంలో హిట్ మెయర్ ఔటయ్యాడు. దీంతో ఆరో వికెట్ కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ తర్వాత పరాగ్ కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో శుభమ్ దూబే (25 నాటౌట్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. మిగతా బౌలర్లలో హర్షిత్ రాణా, మొయిన్ అలీకి రెండేసి వికెట్లు దక్కాయి.




















