అన్వేషించండి

మ్యాచ్‌లు

IPL 2022, MI: హిట్‌మ్యాన్‌ ఉండగా భయమేల! కానీ పాండ్య బ్రదర్స్‌ ఫినిషర్స్‌ లోటు తీర్చేదెవరు MI?

Mumbai Indians IPL 2022: ఐదు ట్రోఫీలు గెలిచిన 'మైటీ ముంబయి' మరో సీజనుకు రెడీ అయింది! ఒకప్పుడు బలంగా కనిపించిన ఆ జట్టు ఇప్పుడెలా ఉంది? గెలుపు అవకాశాలేంటి? ఫినిషర్లు ఎవరు?

IPL 2022, MI team analysis: తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి. జట్టంటే ముంబయి ఇండియన్స్‌లా (Mumbai Indians) ఉండాలి! ఇప్పటి వరకు 14 ఐపీఎల్‌ సీజన్లు జరిగితే 5 సార్లు ట్రోఫీ గెలిచింది హిట్‌మ్యాన్‌ సేన! అందుకే దానిని 'మైటీ ముంబయి' అంటారు. మొన్నటి వరకు దుర్భేద్యంగా కనిపించిన ఆ జట్టు ఇప్పుడెలా ఉంది? కోర్‌టీమ్‌ను (MI core team) దక్కించుకోగలిగిందా? జట్టు కూర్పు కుదురుతుందా? సరైన దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారా? 2022లో రోహిత్‌ సేన అవకాశాలేంటి?

అన్నింట్లో అద్భుతం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో  (Indian premier leauge) ముంబయి ఇండియన్స్‌ అంటే తిరుగులేని జట్టు! టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌, లోయర్‌ ఆర్డర్‌లో తిరుగులేని బ్యాటర్లు ఉంటారు. ఇక పేస్‌ బౌలర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లకు కొదవలేదు. అందుకే ఐదు సార్లు కప్పులు గెలిచింది. ఎంఎస్‌ ధోనీలాగే (MS Dhoni) ఆటగాళ్లపై విపరీతంగా నమ్మకం ఉంచే కెప్టెన్‌ రోహిత్‌ శర్మే  (Rohit sharma) వారి బలం. అతను ఆడకపోయినా మిగతా వాళ్లు ఆకట్టుకుంటారు. తక్కువ స్కోర్లను డిఫెండ్‌ చేసే బౌలర్లూ ఉంటారు. ఇక ముంబయి కోచింగ్‌ స్టాఫ్‌ అయితే అంతర్జాతీయ జట్టు కన్నా బెటర్‌గా ఉంటుంది. అయితే ఆలస్యంగా పుంజుకోవడం, ఆఖర్లో అవకాశాలను కోల్పోవడంతో ఓ బలహీనత. వేలంలో కోరుకున్న కొందరు ఆటగాళ్లను ఆ జట్టు దక్కించుకోలేకపోయింది. అయితే ముంబయి, మహారాష్ట్రలోనే మ్యాచులు జరుగుతుండటం వల్ల ప్లేఆఫ్స్‌ అయితే గ్యారంటీ!

కోర్‌ టీమ్‌ పరిస్థితి ఏంటి?

ముంబయి ఇండియన్స్‌ తన పాత కోర్ టీమ్‌ను (MI core team) దాదాపుగా దక్కించుకుంది. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav), కీరన్‌ పొలార్డ్‌ (Pollard), జస్ప్రీత్‌ బుమ్రా (Jasprit bumrah)ను సొంతం చేసుకుంది. కానీ విధ్వంసకరంగా ఆడే క్వింటన్‌ డికాక్‌, హార్దిక్‌, కృనాల్‌ పాండ్య సోదరులను వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డేనియెల్‌ సామ్స్‌, ఫాబియన్‌ అలెన్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ ఇందులో చేరతారు. అయితే మిడిలార్డర్లో ముంబయికి ఒకప్పటి బలం కనిపించడం లేదు. టాప్‌-4 విఫలమైతే భారమంతా కీరన్‌ పొలార్డ్‌ పైనే పడుతుంది. మ్యాచ్‌ ఫినిషర్ల రోల్స్‌పై స్పష్టత లేదు. అలాగే జస్ప్రీత్‌ బుమ్రాకు తోడుగా అదే స్థాయిలో రాణించే ఇండియన్‌ బౌలర్లు లేరు. బాసిల్‌ థంపి, జయదేవ్‌ ఉనద్కత్‌ ఏ మేరకు రాణిస్తారో తెలియదు. ఏదేమైనా కాంబినేషన్లు, సమతూకం విషయంలో మెరుగుదల అవసరం.

తుది జట్టు అంచనా

రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేస్తారు. వీరిద్దరిదీ డిస్ట్రక్టివ్‌ పెయిర్‌. కానీ ఇద్దరికీ బలహీనతలు ఉన్నాయి. అత్యధిక ధర పలికిన ఒత్తిడి ఇషాన్‌పై ఉంటుంది. వన్‌డౌన్లో సూర్యకుమార్‌ వస్తాడు. నాలుగో స్థానంలో కుర్రాడు తిలక్‌ వర్మకు ఛాన్స్‌ ఉంటుంది. ఈ దేశవాళీ కుర్రాడు 143 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేస్తాడు. అవసరమైతే బౌలింగ్‌ చేయగలడు. ఆ తర్వాత టిమ్‌డేవిడ్‌, కీరన్‌ పొలార్డ్‌, ఫాబియన్ అలన్‌ ఉంటారు. ఈ ముగ్గురూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేస్తారు. ఇక బౌలింగ్‌లో జయదేవ్‌ ఉనద్కత్‌, తైమల్‌ మిల్స్‌, మయాంక్‌ మర్కండే, జస్ప్రీత్‌ బుమ్రా ఉంటారు. ముంబయి ఈ సారి స్వదేశీయుల కన్నా విదేశీయుల మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది.

ముంబయి ఇండియన్స్‌ షెడ్యూలు - Mumbai Indians IPL 2022 Schedule

Date Fixture Time (In IST) Venue
       
March 27 Mumbai Indians vs Delhi Capitals 7:30 PM Brabourne – CCI
April 2 Mumbai Indians vs Rajasthan Royals 3:30 PM DY Patil Stadium
April 6 Kolkata Knight Riders vs Mumbai Indians 7:30 PM MCA Stadium – Pune
April 9 Royal Challengers Bangalore vs Mumbai Indians 7:30 PM MCA Stadium – Pune
April 13 Mumbai Indians vs Punjab Kings 7:30 PM MCA Stadium – Pune
April 16 Mumbai Indians vs Lucknow Super Giants 7:30 PM Brabourne – CCI
April 21 Mumbai Indians vs Chennai Super Kings 7:30 PM DY Patil Stadium
April 24 Lucknow Super Giants vs Mumbai Indians 7:30 PM Wankhede Stadium
April 30 Rajasthan Royals vs Mumbai Indians 7:30 PM DY Patil Stadium
May 6 Gujarat Titans vs Mumbai Indians 7:30 PM Brabourne – CCI
May 9 Mumbai Indians vs Kolkata Knight Riders 7:30 PM DY Patil Stadium
May 12 Chennai Super Kings vs Mumbai Indians 7:30 PM Wankhede Stadium
May 17 Mumbai Indians vs Sunrisers Hyderabad 7:30 PM Wankhede Stadium
May 21 Mumbai Indians vs Delhi Capitals 7:30 PM Wankhede Stadium
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget