KKR vs SRH Final LIVE Score: ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్, 10.3 ఓవర్లలో టార్గెట్ ఉఫ్
KKR vs SRH IPL Final 2024 LIVE Score: ఐపీఎల్ 2024 ఫైనల్లో చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు తలపడుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ లైవ్ అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
LIVE
Background
SRH vs KKR Final LIVE Score: ఐపీఎల్(IPL season 17 Final) అంతిమ సమరానికి సమయం ఆసన్నమైంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఫైనల్లో మాజీ ఛాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్లు తలపడుతున్నాయి. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన కోల్‌కతా ఐపీఎల్‌లో మూడో కప్పుపై కన్నేసింది. ఈ సీజన్‌లో విధ్వంసక బ్యాటింగ్‌తో సరికొత్తగా కనిపించిన హైదరాబాద్ రెండో కప్పును అందుకోవాలని భావిస్తోంది. గతంలో హైదరాబాద్‌కు చెందిన టీమ్ దక్కన్ ఛార్జర్స్ 2009లో రెండో సీజన్ ట్రోఫీ నెగ్గింది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న కేకేఆర్, సన్‌రైజర్స్ జట్ల మధ్య చెపాక్ వేదికగా హోరాహోరీ పోరుకు అంతా సిద్ధం చేశారు.
Two incredible journeys that started on the same day 🚄
— IndianPremierLeague (@IPL) May 26, 2024
They are here to collide on the final day for the epic showdown 🙌😎
🎥 A preview of the #Final ft. two exemplary leaders 💜🧡#TATAIPL | #KKRvSRH | #TheFinalCall
KKR vs SRH Final LIVE Score: ఐపీఎల్ విజేతగా నిలిచిన కేకేఆర్, 10.3 ఓవర్లలో టార్గెట్ ఉఫ్
KKR vs SRH Final LIVE Score: కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 10.3 ఓవర్లలో కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ (52 నాటౌట్), గుర్బాజ్ 39 పరుగులు చేశారు. శ్రేయస్ అయ్యర్ 6 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ 2012, 2014 తరువాత 10 ఏళ్లకు మరో ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది.
KKR vs SRH Final LIVE Score: 6 ఓవర్లలో KKR స్కోరు 72/1
KKR vs SRH Final LIVE Score: 6 ఓవర్లలో KKR స్కోరు 72/1
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 6 ఓవర్లలో కేకేఆర్ 72 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 40, గుర్బాజ్ 21 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 4 ఓవర్లలో KKR స్కోరు 46/1
KKR vs SRH Final LIVE Score: 4 ఓవర్లలో KKR స్కోరు 46/1
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 4 ఓవర్లలో కేకేఆర్ 37 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 21, గుర్బాజ్ 14 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: 3 ఓవర్లలో KKR స్కోరు 37/1, టార్గెట్ 114
KKR vs SRH Final LIVE Score: 3 ఓవర్లలో KKR స్కోరు 37/1, టార్గెట్ 114
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్లో 3 ఓవర్లలో కేకేఆర్ 37 పరుగులు చేసింది. కోల్‌కతా ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ 19, గుర్బాజ్ 9 రన్స్‌తో ఆడుతున్నారు.
KKR vs SRH Final LIVE Score: తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్, సునీల్ నరైన్ ఔట్
KKR vs SRH Final LIVE Score: తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్, సునీల్ నరైన్ ఔట్
ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కమిన్స్ బౌలింగ్ లో సునీల్ నరైన్ సిక్సర్ కొట్టాడు, ఆ మరుసటి బంతికి భారీ షాట్ ఆడి షాబాజ్ అహ్మద్ చేతికి చిక్కాడు. తొలి వికెట్ రూపంలో నిష్క్రమించాడు.