KKR Vs RR: ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన సంజు - మొదట బౌలింగ్‌కే మొగ్గు!
ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Rajasthan Royals vs Kolkata Knight Riders: ఐపీఎల్ 2023 సీజన్ 55వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ రెండు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఇక మురుగన్ అశ్విన్ స్థానంలో కేఎం ఆసిఫ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం ఒక్క మార్పే చేసింది. వైభవ్ అరోరా స్థానంలో అనుకుల్ రాయ్ తుది జట్టులోకి రానున్నాడు.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరో స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లలో మూడో స్థానంలోకి వెళ్లనుంది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలోకి పడిపోతుంది. టాప్-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఎలాంటి ప్రమాదం లేదు.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డోనావన్ ఫెరీరా, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, మురుగన్ అశ్విన్, నవదీప్ సైనీ
కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీసన్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్
ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ చెరో పది పాయింట్లతో నిలిచాయి. అందుకే వీరిద్దరికీ ఈ మ్యాచ్ అత్యంత కీలకం. చరిత్రను చూస్తే రాయల్స్, నైట్‌రైడర్స్ నువ్వా నేనా అన్నట్టే తలపడ్డాయి. ఇప్పటి వరకు 27 మ్యాచుల్లో ఢీకొన్నాయి. అయితే 14-10తో కేకేఆర్‌దే పైచేయి. రెండు మ్యాచుల్లో ఫలితం రాలేదు. రీసెంట్ ఫామ్ సైతం కేకేఆర్‌కే అనుకూలంగా ఉంది. చివరి ఐదు మ్యాచుల్లో 3-2తో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2020లో కేకేఆర్ 60 రన్స్ తేడాతో గెలిచింది. 2021లో తొలి మ్యాచులో రాయల్స్ 7 వికెట్లతో అదరగొట్టింది. కాగా రెండో మ్యాచులో కోల్‌కతా 86 రన్స్‌తో విజయ దుందుభి మోగించింది. ఇక 2022లోనూ చెరో మ్యాచ్ గెలిచాయి. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ సీజన్లో రాజస్థాన్ 11 మ్యాచులు ఆడింది. తొలి ఐదు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచ్ ఓడింది. మిగిలిన నాలుగింట్లో అదరగొట్టింది. ఆ ఓడిపోయిన మ్యాచులోనూ ఆఖరి వరకు పోరాడింది. చివరి ఆరు మ్యాచుల్లో సంజూ సేన ఒక్కటే గెలిచింది. మిగిలిన ఐదు ఓడింది. ఇక చివరి మూడు మ్యాచుల్లోనూ ఓడి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫామ్ విచిత్రంగా ఉంది. తొలి మ్యాచ్ ఓడి తర్వాతి రెండింట్లో గెలిచింది. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓడింది. అయితే చివరి నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచి ఒకటి మాత్రమే ఓడింది.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌కు స్వర్గ ధామం. ఈ సీజన్లో ఫస్ట్ ఇన్నింగ్స్ సగటు స్కోరే 205గా ఉంది. ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లే ప్రభావం చూపిస్తున్నారు. 8.49 ఎకానమీతో 31 వికెట్లు తీశారు. పేసర్లు 10.47 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టారు. ఈడెన్‌లో ఇప్పటి వరకు 84 మ్యాచులు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 34, ఛేదన జట్లు 50 గెలిచాయి. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ రావడంతో బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది.