అన్వేషించండి

Jake Fraser Mcgurk: 29 బాల్స్‌లోనే సెంచరీ- ABD,గేల్ రికార్డులు బద్ధలు

LSG vs DC Highlights: ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 పరుగులు కొడితే ఎప్పుడూ ఓడిపోని లక్నో...ఆస్ట్రేలియా బుడ్డోడు జేక్ ఫ్రెజర్ కొట్టుడుకు ఓడిపోవాల్సి వచ్చింది.

Jack Fraser Mc Gruk Half Century : ఫస్ట్ ఇన్నింగ్స్ లో 160 పరుగులు కొడితే ఎప్పుడూ ఓడిపోని లక్నో...ఆస్ట్రేలియా బుడ్డోడు జేక్ ఫ్రెజర్ కొట్టుడుకు ఓడిపోవాల్సి వచ్చింది. 22 ఏళ్ల ఈ కుర్రాడు ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే దుమ్ముదులిపాడు. మనోడు చూడటానికి సన్నగా ఉన్నప్పటికీ..షాట్స్ మాత్రం బలంగా కొడుతున్నాడు. బౌలర్ ఎంత స్పీడుగా బాల్ వేస్తే.. అంతే స్పీడుగా  బౌండరీకి పంపుతున్నాడు.

ముఖ్యంగా కృణల్ పాండ్య ఓవర్ లో 3 సిక్సులు కొట్టడం మొత్తం మ్యాచ్ నే టర్న్ తిప్పింది. అలా.. కేవలం 35 బాల్స్ లోనే 5 సిక్సులు,2 ఫోర్లతో55 రన్స్ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ కాదు..మనోడిపై ఇంకా రెండు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అవేంటంటే..! లిస్ట్-A క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యంత ఫాసెస్ట్ సెంచరీ కొట్టి AB డెవిలియర్స్ రికార్డు బద్దలు కొట్టాడు. కేవలం 29 బాల్స్ లోనే 100 పరుగులు కొట్టాడు. ఇక ప్రొఫెషనల్ క్రికెట్ లో టీ20లో కేవలం 30 బాల్స్ లోనే సెంచరీ కొట్టి గేల్ రికార్డును కూడా లేపేశాడు. 2020-21 బిగ్ బాష్ లీగ్ లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ అరంగేట్రంతో దుమ్ముదులిపాడు. జాక్ ఇదే ఫామ్ ని కొనసాగిస్తే..దిల్లీకి తిరుగుండదు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన మ్యాచ్‌లో సంచలనాలు నమోదు అయ్యాయి. జోరు మీద ఉన్న ఎల్ఎస్‌హెచ్‌కు ఢిల్లీ షాక్ ఇచ్చింది. దాదాపు రెండు ఓవర్లు ఉండగానే  167 పరుగుల లక్ష్యాన్ని డీసీ ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ఫీల్డింగ్‌తో కట్టడి చేశారు. అయినా ఓపెనర్లు చాలా స్పీడ్‌గా ఆడారు. రాహుల్ ఉన్నంత వరకు ఆ జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉన్నట్టు కనిపించింది. 39 పరుగులు వద్ద రాహుల్‌ను కులదీప్‌ యాదవ్‌ ఔట్‌ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆఖరిలో ఆయుష్ బదోని ధాటిగా ఆడటంో పోరాడే స్కోరును లక్నోకు అందించాడు. 

168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ ఆది నుంచి చాలా స్పీడ్‌గా ఆడింది. మొదటి వికెట్ త్వరగా తీసినా పృథ్వీ షా, జేక్‌ ఫ్రెసర్‌ మెక్‌గర్క్‌ జోరును అడ్డుకోలేకపోయారు. ఏడో ఓవర్‌లో పృథ్వీ అవుటైనప్పటికీ    మెక్‌గర్క్‌ స్పీడ్‌కు బ్రేక్‌లు పడలేదు. 13 ఓవర్లు కంప్లీట్ అయ్యేటప్పటికి మ్యాచ్‌ను ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. మెక్‌గర్క్‌ 35 బంతుల్లో 55 పరుగులు చేసి నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఆ జోరు కొనసాగించారు. 24 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్‌లో స్టబ్స్‌, హోప్స్‌ విజయానికి చేరువ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget