News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

ఐపీఎల్ ఫైనల్‌ వర్షం కారణంగా ఆలస్యం అయింది. ఈ మ్యాచ్ కటాఫ్ టైం, దానికి సంబంధించిన వివరాలు!

FOLLOW US: 
Share:

CSK vs GT, IPL Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా టాస్ సకాలంలో కుదరకపోవడంతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ ప్రారంభం కాకపోతే ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేని కూడా ఉంచారు. వర్షం కారణంగా రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్‌లో, కటాఫ్ సమయం వరకు ఆట ప్రారంభించలేకపోతే, మ్యాచ్ రిజర్వ్ డేకి వెళుతుంది.

ఈ మ్యాచ్‌లో భారత కాలమానం ప్రకారం 9:35కి ఆట ప్రారంభమైతే పూర్తిగా 20 ఓవర్ల ఆట జరుగుతుంది. ఆ సమయం ఇప్పటికే దాటిపోయింది. 9:45కి ఆట ప్రారంభం అయితే ఓవర్ల సంఖ్య 19కి తగ్గుతుంది. 10:30కు ప్రారంభం అయితే 15 ఓవర్లు, 11 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయితే 12 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ 11:30కు ప్రారంభం అయితే రెండు జట్లూ చెరో తొమ్మిది ఓవర్లు మాత్రమే ఆడతాయి. 11:56కు మ్యాచ్ మొదలైతే ఐదు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ సమయం దాటిందంటే ఈరోజుకు మ్యాచ్ ఇక జరగనట్లే.

క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో గుజరాత్‌ ఓటమి
క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ మ్యాచ్‌లో నేరుగా తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీని తర్వాత క్వాలిఫయర్ 2లో ముంబైని ఓడించి గుజరాత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ సీజన్‌లోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ జరుగుతోంది. ఐదో ఐపీఎల్ ట్రోఫీపై చెన్నై కన్నేస్తే, గుజరాత్ జట్టు వరుసగా రెండోసారి కప్ గెలవాలని భావిస్తోంది.

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రెండో జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఇప్పటి వరకు నాలుగు ట్రోఫీలు గెలిచింది. ఇప్పుడు ఐదోది గెలిచి ముంబయి ఇండియన్స్‌ రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే మొతేరాలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలవ్వడం నెగెటివ్‌ సెంటిమెంట్‌గా మారింది. దాంతో జట్టు పూర్తిగా ఎంఎస్‌ ధోనీ వ్యూహాలనే నమ్ముకొంది. మహ్మద్‌ షమీ బౌలింగ్లో రుతురాజ్ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వేకు మెరుగైన రికార్డు లేదు. వారెలాంటి ఓపెనింగ్‌ ఇస్తారనేది చూడాలి. మిడిలార్డర్లో శివమ్‌ దూబె, అజింక్య రహానె మంచి ఇంటెట్‌ చూపిస్తున్నారు. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో తిరుగులేని విధంగా ఆడుతున్నాడు. పైగా దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్రకు ఆడే ప్లేయర్‌. అందుకే మోదీ స్టేడియం అతడికి కొట్టిన పిండి! మతీశ పతిరణ, దేశ్‌పాండే, దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌ కీలకం కానుంది.

సీఎస్కేకు చెపాక్‌ ఎలాగో టైటాన్స్‌కు మొతేరా అలాగే! ఇక్కడ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు గెలిచింది. అదీ భారీ స్కోర్లు చేయడం ద్వారానే! అందుకే ఇక్కడ కుంగ్‌ ఫూ పాండ్య సేనను ఓడించడం చెన్నైకి సులభమేమీ కాదు! ఇందుకోసం ప్రత్యేక వ్యూహాలు రచించాలి. చెపాక్‌ తరహా స్లో టర్నర్లు ఇక్కడ ఉండవు. బంతి.. బ్యాటుపైకి చక్కగా వస్తుంది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను ఎదుర్కోవడం ఈజీ కాదు! అతడు నిలబడితే మరో సెంచరీ చేయడం ఖాయం. వృద్ధిమాన్‌ సాహా అతడికి అండగా నిలవాలి. సాయి సుదర్శన్‌ సైతం మంచి ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. క్వాలిఫయర్‌-2లో హార్దిక్‌ మంచి ఇంటెంట్‌ చూపించాడు. పైగా బౌలింగ్‌ చేశాడు. మిడిలార్డర్లో డేవిడ్‌ మిల్లర్‌, తెవాతియా, రషీద్‌ ఉన్నారు. విజయ్‌ శంకర్‌ను మరిచిపోవద్దు! ఇక బౌలింగ్‌ పరంగా గుజరాత్‌ను ఢీకొట్టే టీమ్‌ కనిపించడం లేదు. రషీద్‌, నూర్‌ అహ్మద్‌ వికెట్లు తీస్తూ పరుగుల్ని కంట్రోల్‌ చేస్తున్నారు. ఒకవేళ వారిని అటాక్‌ చేసినా మహ్మద్ షమి, మోహిత్‌ శర్మను ఆడటం కష్టంగా మారింది. జోష్ లిటిల్‌ రూపంలో మరో మంచి పేసర్‌ ఉన్నాడు. ముంబయిపై విజయంతో టైటాన్స్‌ జోష్‌లో ఉంది.

Published at : 28 May 2023 09:47 PM (IST) Tags: Hardik Pandya MS Dhoni Gujarat Titans IPL 2023 Chennai Super Kings Indian Premier League 2023

ఇవి కూడా చూడండి

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

R Ashwin: 'ఐపీఎల్‌ వార్‌ఫేర్‌'పై స్పందించిన యాష్‌ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్‌

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్‌ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్‌ పదవికి గంభీర్ రిజైన్‌ చేస్తున్నాడా!

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి