IPL Auction 2026: ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ ఇలా చూసేయండి
IPL Auction 2026 Live Streaming: ఐపీఎల్ 2026 వేలం అబుదాబీలో జరగనుంది. ఈ మినీ వేలం కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ, ఎలా చూడవచ్చు తెలుసుకోండి.

IPL 2026 వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను BCCI ఇటీవల విడుదల చేసింది. అభిమానులు కూడా ఈ మినీ వేలం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి వేలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. అందుకే దీనిని మినీ వేలం (IPL Mini Auction) అని పిలుస్తున్నారు. గత ఎడిషన్ కోసం ఆటగాళ్ల వేలం 2 రోజులు జరిగింది. వేలం ఏ తేదీన, ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది. దీని ప్రత్యక్ష ప్రసారం ఏ ఛానెల్‌లో, లైవ్ స్ట్రీమింగ్ ఏ యాప్‌లో చూడవచ్చు, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ ఎడిషన్ కోసం మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం 350 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. 40 మంది ఆటగాళ్లు 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్‌తో ఉన్నారు. 30 లక్షల బేస్ ప్రైస్‌తో 227 మంది ఆటగాళ్లు మినీ వేలంలో తమ లక్ పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో 16 మంది భారత క్రికెటర్లు, 96 మంది విదేశీ అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నారు. అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విషాయానికి వస్తే, 224 మంది భారత డొమెస్టిక్ ప్లేయర్లు, 14 మంది విదేశీయులు ఉన్నారు.
IPL 2026 వేలంలో మొత్తం ఎన్ని స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి?
IPL 2026 వేలం కోసం 350 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వీరిలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లు మాత్రమే వేలంలో అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్ 10 జట్లలో మొత్తం 77 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అత్యధిక స్లాట్‌లు KKR (13)లో ఖాళీగా ఉన్నాయి. కేకేఆర్ ఫ్రాంచైజీ కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. వేలంలో పాల్గొనే జట్లలో KKR అత్యధిక పర్స్ బ్యాలెన్స్‌ను కూడా కలిగి ఉంది. 10 జట్లలో ఎన్ని ఆటగాళ్ల స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి, ఆ ఫ్రాంచైజీ వద్ద బ్యాలెన్స్ ఎంత ఉందో ఈ వివరాలు చూడండి.
- కోల్‌కతా నైట్ రైడర్స్ - 13 (రూ. 64.3 కోట్లు)
- చెన్నై సూపర్ కింగ్స్ - 9 (రూ. 43.4 కోట్లు)
- సన్‌రైజర్స్ హైదరాబాద్ - 10 (రూ. 25.5 కోట్లు)
- లక్నో సూపర్ జెయింట్స్ - 6 (రూ. 22.95 కోట్లు)
- ఢిల్లీ క్యాపిటల్స్ - 8 (రూ. 21.8 కోట్లు)
- గుజరాత్ టైటాన్స్ - 5 (రూ. 12.9 కోట్లు)
- పంజాబ్ కింగ్స్ - 4 (రూ. 11.5 కోట్లు)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 8 (రూ. 16.4 కోట్లు)
- రాజస్థాన్ రాయల్స్ - 9 (రూ. 16.05 కోట్లు)
- ముంబై ఇండియన్స్ - 5 (రూ. 2.75 కోట్లు)
IPL 2026 వేలం ఏ తేదీన జరుగుతుంది?
మంగళవారం నాడు అంటే, డిసెంబర్ 16, 2025న వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ వేలం జరగనుంది.
IPL 2026 వేదిక
ఈసారి కూడా అబుదాబి వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు.
IPL 2026 వేలం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది?
IPL 2026 వేలం భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.
IPL 2026 వేలం ప్రత్యక్ష ప్రసారం ఏ ఛానెల్‌లో వస్తుంది?
స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో IPL 19 వేలం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
IPL 2026 వేలం లైవ్ స్ట్రీమింగ్ ఏ యాప్‌లో చూడవచ్చు?
IPL వేలం లైవ్ స్ట్రీమింగ్ JioHotstar యాప్, జియో హాట్‌స్టార్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.





















