Unsold players IPL 2026: స్మిత్ నుండి కాన్వే వరకు, అశ్విన్ మాక్ వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ లిస్ట్ చూశారా
Unsold players IPL: ఐపీఎల్ 2026 అశ్విన్ మాక్ వేలంలో చాలా మంది స్టార్ ఆటగాళ్ళు అమ్ముడుపోలేదు. స్టీవ్ స్మిత్ మళ్ళీ అమ్ముడుపోకపోవడం హాట్ టాపిక్ అయింది.

Unsold players IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ అంటే IPL 2026 కోసం డిసెంబర్ 16న అబుదాబిలో వేలం జరగనుంది. ఈసారి IPLలో మినీ వేలం నిర్వహించనున్నారు. ఇందుకోసం దాదాపు 350 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ప్లేయర్స్ కామెరూన్ గ్రీన్, భారతదేశానికి చెందిన వెంకటేష్ అయ్యర్ భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉంది.
IPL 2026 వేలానికి ముందు, భారత మాజీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక మాక్ వేలం నిర్వహించాడు. ఇందులో చాలా మంది స్టార్ ప్లేయర్లు అమ్ముడుపోలేదు.
అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక మాక్ వేలం నిర్వహించాడు. ఈ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ముబీజ్ ఉర్ రెహ్మాన్, వెస్టిండీస్‌కు చెందిన అకీల్ హుస్సేన్ వంటి పెద్ద ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.
అశ్విన్ మాక్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల లిస్ట్
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)
డెవాన్ కాన్వే (న్యూజిలాండ్)
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (ఆస్ట్రేలియా)
బెన్ డకెట్ (ఇంగ్లాండ్)
జాకబ్ డఫీ (న్యూజిలాండ్)
అకీల్ హుస్సేన్ (వెస్టిండీస్)
ముజీబ్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్)
డేనియల్ లారెన్స్ (ఇంగ్లాండ్)
లియామ్ డాసన్ (ఇంగ్లాండ్)
సాకిబ్ మహమూద్ (ఇంగ్లాండ్)
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్)
షై హోప్ (వెస్టిండీస్)
విలియం ఓ'రూర్కే (న్యూజిలాండ్)
టామ్ కరన్ (ఇంగ్లాండ్)
తబ్రేజ్ షంసీ (దక్షిణాఫ్రికా)
రీజా హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా)
టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్)
బ్యూ వెబ్‌స్టర్ (ఆస్ట్రేలియా)
రోస్టన్ ఛేజ్ (వెస్టిండీస్)
కైల్ మేయర్స్ (వెస్టిండీస్)
ఓలీ స్టోన్ (ఇంగ్లాండ్)
డేనియల్ సామ్స్ (ఆస్ట్రేలియా)
బెన్ డ్వార్‌షియస్ (ఆస్ట్రేలియా)
జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా)
కుసల్ పెరీరా (శ్రీలంక)
ఉమేష్ యాదవ్ (భారతదేశం)
మొహమ్మద్ వకార్ సలాంఖేల్ (ఆఫ్ఘనిస్తాన్)
గుల్బదీన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్)
విలియం సదర్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా)
జోషువా టోంగ్ (ఇంగ్లాండ్)
చరిత్ అసలంక (శ్రీలంక)
అశ్విన్ మాక్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితా
కామెరూన్ గ్రీన్ - రూ. 21 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ CSK
లియామ్ లివింగ్‌స్టన్ - రూ. 18.5 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ KKR
వెంకటేష్ అయ్యర్ - రూ. 17.5 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ KKR
రవి బిష్ణోయ్ - రూ. 10.5 కోట్లు, హైదరాబాద్ SRH
జేసన్ హోల్డర్ - రూ. 9 కోట్లు, లక్నో LSG
మతీషా పతిరణ - రూ. 7 కోట్లు, ఢిల్లీ DC
పృథ్వీ షా - రూ. 5.25 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ KKR
డేవిడ్ మిల్లర్ - రూ. 4.5 కోట్లు, పంజాబ్ కింగ్స్ PBKS
జానీ బెయిర్‌స్టో - రూ. 3.75 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ KKR
టిమ్ సీఫర్ట్ - రూ. 3 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ DC
బెన్ డకెట్ - రూ. 4 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ KKR
జేమీ స్మిత్ - రూ. 3.75 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ DC
ఆకాష్ దీప్ - రూ. 3.25 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ CSK
ఆకిబ్ నబీ - రూ. 3 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ DC
వానిందు హసరంగా - రూ. 2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ LSG
రచిన్ రవీంద్ర - రూ. 2.25 కోట్లు, పంజాబ్ కింగ్స్ PBKS
ముస్తాఫిజుర్ రెహ్మాన్ - రూ. 3.5 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB
ఎన్రిక్ నోర్ఖియా - రూ. 3 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH
రాహుల్ చాహర్ - రూ. 3.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ RR
జోష్ ఇంగ్లిస్ - రూ. 2 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ CSK
అకీల్ హుస్సేన్ - రూ. 2 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ CSK
అభినవ్ మనోహర్ - రూ. 1.75 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ LSG




















