News
News
వీడియోలు ఆటలు
X

RCB Vs GT: ప్రమాదంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు - వరుణ దేవుడు అడ్డం పడతాడా?

ఐపీఎల్‌లో నేడు (ఆదివారం) రాత్రి జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ప్రమాదంలో పడింది.

FOLLOW US: 
Share:

RCB vs GT Weather Latest Update: ఐపీఎల్ 2023 70వ, చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందుగా బెంగళూరులోని చిన్నస్వామిలో భారీ వర్షం కురిసిన వార్త వెలుగులోకి వచ్చింది. వార్తల ప్రకారం బెంగళూరులో వడగళ్ళు కూడా కురిశాయి. మైదాన ప్రాంతంలో భారీ వర్షం కురియడంతో పిచ్‌ను పూర్తిగా కప్పేశారు.

బెంగళూరుకు ఈ మ్యాచ్ కీలకం
బెంగళూరు, గుజరాత్ మధ్య జరిగే ఈ మ్యాచ్ బెంగళూరుకు చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌లో నాలుగో జట్టుగా అవతరిస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే బెంగళూరుకు పెద్ద సమస్యే ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి, ఆర్‌సీబీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. ఆర్సీబీ గ్రూప్ దశలోనే వెనుదిరుగుతుంది.

బెంగళూరులో వాతావరణం ఎలా ఉంది?
మరోవైపు, బెంగళూరు వాతావరణం గురించి చెప్పాలంటే నగరం ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంది. ఆరు గంటల వరకు వర్ష సూచన తగ్గుతుందని, అయితే మరోసారి 7 గంటలకు 65 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని, ఆ సమయంలో ఆకాశం 98 శాతం మేఘావృతమై ఉంటుందని నివేదిక పేర్కొంది. ఏడు గంటల సమయానికి ఉష్ణోగ్రత 27 డిగ్రీల వరకు ఉంటుంది.

మరి ఆర్‌సీబీ, గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతుందా లేక వర్షం విలన్‌గా మారుతుందా అనేది చూడాలి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అదే సమయంలో ముంబై జట్టు 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. వాంఖడే స్టేడియంలో ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

బెంగళూరులో   వర్షం పడటం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తున్నది. ఒకవేళ హైదరాబాద్ పై ముంబై గెలిస్తే అప్పుడు  బెంగళూరుకు ఇది ప్రమాదమే. ముంబై ఓడితే.. గుజరాత్ తో మ్యాచ్ గెలిచినా   ఓడినా.. వర్షం వల్ల రద్దు అయినా బెంగళూరుకు చింత లేదు.  ఇరు జట్లు సమాన మ్యాచ్ (13) లు సమాన పాయింట్లు (14) తో ఉన్నా ముంబై నెట్ రన్ రేట్ (-0.128)  కంటే ఆర్సీబీ ( +0.180)  మెరుగ్గా ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 

ఆర్సీబీకి బ్యాటింగే బలం. కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్)  రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. అదే సమయంలో వీరు విఫలమైతే ఆ జట్టుకు  కష్టాలు తప్పవు.  సొంత గ్రౌండ్ లో ఆడుతుండటం ఆ జట్టుకు కలిసొచ్చేదే అయినా  గుజరాత్ బౌలింగ్ దాడిని  డుప్లెసిస్ గ్యాంగ్ ఎలా ఎదుర్కుంటుదనేది ఆసక్తికరం. 

వరుసగా రెండో సీజన్ లో  ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన  గుజరాత్ టైటాన్స్‌కు ఈ మ్యాచ్ ఫలితంతో పెద్దగా ఉపయోగం లేదు. కానీ క్వాలిఫైయర్ -1 కు ముందు  గెలిచిన ఉత్సాహంతో ఉండాలని హార్ధిక్ సేన భావిస్తున్నది. నామమాత్రపు మ్యాచ్ కావడంతో  ఈ  మ్యాచ్ కోసం గుజరాత్ జట్టు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. జోషువా లిటిల్ తిరిగి జట్టుతో చేరడంతో  అతడు  ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు.  విజయ్ శంకర్ కూడా  బెంగళూరులో ఆడే అవకాశముంది. 

Published at : 21 May 2023 06:15 PM (IST) Tags: IPL 2023 M Chinnaswamy Stadium RCB vs GT Bengaluru Weather

సంబంధిత కథనాలు

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: నేను సిక్సర్లు మాత్రమే కొడతా - వైరల్ అవుతున్న శివం దూబే ప్రాక్టీస్ వీడియో!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

IPL Final 2023: ఐపీఎల్ ఫైనల్ ఏ టైంకి స్టార్ట్ అయితే ఎన్ని ఓవర్లు పడతాయి - 11:56 వరకు వెయిటింగ్!

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

ఫైనల్‌ను అడ్డుకున్న వరుణుడు - వర్షం కారణంగా టాస్ ఆలస్యం!

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి