(Source: ECI/ABP News/ABP Majha)
PBKS vs RCB Preview: రబాడ అంటే ఆర్సీబీకి గజ..గజ! టాప్ ఆర్డర్ మొత్తం గడ..గడ!
PBKS vs RCB Preview: ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో గురువారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది.
PBKS vs RCB Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో గురువారం డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతున్నాయి. మొదటి పోరులో పంజాబ్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది. మొహాలిలో మరి ఆర్సీబీ గట్టిపోటీనిచ్చేనా?
గబ్బర్ డౌటే!
పంజాబ్ కింగ్స్ (Royal Challengers Bangalore) ఈ సీజన్లో అమేజింగ్ విక్టరీస్‌తో దూసుకుపోతోంది. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతోంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan), సీనియర్లు లేనప్పటికీ చివరి మ్యాచులో లక్నోపై ఆఖర్లో అవకాశాలను సృష్టించుకొని విజయం అందుకుంది. ఈ మ్యాచుకూ గబ్బర్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. గాయం నుంచి అతడింకా కోలుకోలేదనే అనిపిస్తోంది. లియామ్ లివింగ్‌స్టోన్ రిహాబిలిటేషన్ సాగుతోంది. అతడు అందుబాటులోకి వస్తే మరింత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ డెప్త్ దొరుకుతుంది. సికిందర్ రజా బంతి, బ్యాటుతో ఆదుకుంటున్నాడు. షారుక్ ఖాన్ ఫర్వాలేదు. బౌలింగ్‌లో అర్షదీప్ కీలకం. రబాడాకు ఆర్సీబీపై మంచి రికార్డుంది. టీ20ల్లో డుప్లెసిస్, కోహ్లీ, మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌ను చాలాసార్లు ఔట్ చేశాడు. కరణ్, హర్‌ప్రీత్, రాహుల్ చాహర్, ఆకాశ్ బౌలింగ్ ఫర్వాలేదు.
రబాడతో ఆర్సీబీకి భయం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును (Royal Challengers Bangalore) ప్రతి సీజన్లో ఎదురయ్యే సమస్యే వేధిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్లో ఎవ్వరూ ఆదుకోవడం లేదు. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మాక్స్‌వెల్ మినహా ఎవ్వరూ ఫామ్‌లో లేరు. లోమ్రర్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్ భాగస్వామ్యాలు నెలకొల్పడం లేదు. దినేశ్ కార్తీక్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్సు ఇప్పటి వరకు ఆడలేదు. రబాడాతో ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్‌కు ప్రమాదం పొంచివుంది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఫర్వాలేదు. వేన్ పర్నెల్ కొనసాగొచ్చు. హర్షల్ పటేల్ వికెట్లు తీయాలి. వనిందు హసరంగ, షాబాజ్ స్పిన్ బౌలింగ్ ఫర్వాలేదు. అయితే చిన్నస్వామిలో వీరు ప్రభావం చూపించడం లేదు. జోష్ హేజిల్‌వుడ్ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదు. పంజాబ్‌తో చివరి ఆరు మ్యాచుల్లో ఆర్సీబీ ఐదు సార్లు ఓడిపోవడం నెగెటివ్ సైన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ, రీస్ టాప్లీ.
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సే, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కేవరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.