Ambati Rayudu: సన్‌రైజర్స్‌పై 'అంబటి రాయుడే' మా బాహుబలి - సీఎస్కే
Ambati Rayudu: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఒక్కసారి లయ అందుకున్నాడంటే అపోజిషన్ టీమ్స్‌కు ఇబ్బందులు తప్పవు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ అతడిని 'బాహుబలి' అని పిలుచుకుంటోంది.
Ambati Rayudu, IPL 2023:
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఒక్కసారి లయ అందుకున్నాడంటే అపోజిషన్ టీమ్స్‌కు ఇబ్బందులు తప్పవు. దంచికొడితే బంతులు స్టాండ్స్ బయట పడతాయి. స్టేడియంలో సిక్సర్లు, బౌండరీల వర్షం కురుస్తుంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) అతడిని 'బాహుబలి' అని పిలుచుకుంటోంది. ఇందుకో కారణం ఉందండోయ్..!
Top gear Drive 💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/hhCYxoQxHc
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2023
సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు పైన అంబటి రాయుడికి అదరిపోయే రికార్డులు ఉన్నాయి. ఎందుకో తెలీదు కానీ వారితో ఆడినప్పుడల్లా పరుగుల వరద పారిస్తుంటాడు. తన టీమ్‌ను ఆధిపత్యంలోకి తీసుకెళ్తాడు. గణాంకాలూ ఇదే విషయం చెబుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అంబటి రాయుడు 20 మ్యాచులు ఆడాడు. 17 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేశాడు. 45 సగటు, 130.12 స్ట్రైక్‌రేట్‌తో 540 పరుగులు చేశాడు. 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఐదుసార్లు నాటౌట్‌గా నిలిచాడు.
దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత అతడికి ఇష్టమైన ప్రత్యర్థి ఆరెంజ్ ఆర్మీ. డీసీపై 24 మ్యాచుల్లో 606 రన్స్ చేశాడు. ఆర్సీబీపై 26 మ్యాచుల్లో 728 కొట్టాడు. ఆ తర్వాత హైయెస్ట్ స్కోరు సన్‌రైజర్స్ పైనే. అందుకే హైదరాబాద్‌పై అంబటి రాయుడు 'బాహుబలి' అని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగులో అంబటి రాయుడు ఇప్పటి వరకు 193 మ్యాచులు ఆడాడు. 29.01 సగటు, 127.44 స్ట్రైక్‌రేట్‌తో 4264 పరుగులు చేశాడు. 22 హాఫ్ సెంచరీలు బాదేశాడు. అతనాడిన జట్లకు 13.85 శాతం కంట్రిబ్యూట్ చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 79 మ్యాచులాడి 31.86 సగటు, 129.14 స్ట్రైక్‌రేట్‌తో 1848 పరుగులు చేశాడు. 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో 5 మ్యాచులాడి 3 గెలిచింది. 2 ఓడింది. 6 పాయింట్లు, 0.265 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిస్తే మరో 2 పాయింట్లు అదనంగా కలుస్తాయి. మొత్తం 8 పాయింట్లతో ఇదే మూడో స్థానంలో ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మెరుగైన రన్‌రేట్‌తో ఉన్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.