By: ABP Desam | Updated at : 30 Apr 2022 05:27 PM (IST)
Edited By: Ramakrishna Paladi
విరాట్ కోహ్లీ (Image Credit: iplt20.com)
GT vs RCB, 1 Innings Highlights: ఐపీఎల్ 2022లో 43వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణించింది. గుజరాత్ టైటాన్స్‌కు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6) మళ్లీ ఫామ్ కనబరిచాడు. 14 ఐపీఎల్ మ్యాచుల తర్వాత హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా రజత్ పాటిదార్ (52; 32 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆఖర్లో మాక్సీ (33; 18 బంతుల్లో 3x4, 2x6) , మహిపాల్ లోమ్రర్ (16; 8 బంతుల్లో 2x4, 1x6) మెరుపులు మెరిపించారు. టైటాన్స్‌లో ప్రదీప్ సంగ్వాన్ 2 వికెట్లు తీశాడు.
మధ్యాహ్నం మ్యాచ్ కావడం, టార్గెట్లను డిఫెండ్ చేస్తుండటంతో టాస్ గెలిచిన డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎప్పట్లాగే కోరుకున్న ఆరంభం మాత్రం వారికి దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్ద ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (0) డకౌట్ అయ్యాడు. గుజరాత్ చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ఆచితూచి ఆడారు. సింగిల్స్, డబుల్స్ తీసి చక్కని భాగస్వామ్యానికి పునాది వేశారు.
వికెట్‌పై నిలదొక్కుకోగానే పాటిదార్ బౌండరీలు, సిక్సర్లు బాదటం మొదలు పెట్టాడు. మరోవైపు విరాట్ రిస్క్ తీసుకోకుండా బౌండరీలు కొడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరికాసేపటికే పాటిదార్ హాఫ్ సెంచరీ అందుకొన్నాడు. 74 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని పాటిదార్‌ను ఔట్ చేయడం ద్వారా సంగ్వాన్ విడదీశాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో విరాట్ భారీ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో మాక్సీ, మహిపాల్ లోమ్రర్ స్కోరును 170/6కు తీసుకెళ్లారు.
Virat Kohli back amongst the runs. ✅
Maiden half-century for Patidar. ✅
Quick fire innings from Maxi and Lomror at the death. ✅
Time for our bowlers to lead the charge from ball 1️⃣. 👊🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #GTvRCB pic.twitter.com/F5yqSD9Nl8 — Royal Challengers Bangalore (@RCBTweets) April 30, 2022
A partnership that has set us up to finish big in the last 6️⃣ overs. 🤜🏻🤛🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) April 30, 2022
Well played, Rajat! Brilliant innings. 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #GTvRCB pic.twitter.com/v6ZQKwqbfe
What an innings this has been! 🤩👏🏻👏🏻
— Royal Challengers Bangalore (@RCBTweets) April 30, 2022
Maiden half-century for Rajat! 🙌🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #GTvRCB pic.twitter.com/siqxZ8akOC
IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?
SRH Vs PBKS Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ - ఎవరికీ ఉపయోగం లేని మ్యాచ్!
MI vs DC: ముంబయి గెలవగానే కోహ్లీ ఎమోషన్ చూడండి! ఆర్సీబీ డెన్‌లో అరుపులు, కేకలు!
Rishabh Pant: ఎంత పనిచేశావ్ పంత్! టిమ్డేవిడ్పై రివ్యూ ఎందుకు అడగలేదంటే?
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
In Pics : దావోస్ లో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ భేటీ