News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

SRH vs RCB, 1 innings highlights: 0/1 నుంచి 192/3కు ఆర్సీబీ - ఇలా ఫినిష్‌ చేస్తారని SRH అస్సలు అనుకోలేదుగా!

SRH vs RCB, 1 innings highlights: ఐపీఎల్‌ 2022లో 54వ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 193 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది.

FOLLOW US: 
Share:

SRH vs RCB, 1 innings highlights: ఐపీఎల్‌ 2022లో 54వ మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 193 పరుగుల భారీ టార్గెట్‌ ఇచ్చింది. బ్యాడ్‌ ఓపెనింగ్‌ వచ్చినా డుప్లెసిస్‌ (73*; 50 బంతుల్లో 8x4, 2x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రజత్‌ పాటిదార్‌ (48; 38 బంతుల్లో 4x4, 2x6) హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. ఆఖర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (33; 24 బంతుల్లో 3x4, 2x6), దినేశ్ కార్తీక్ (30*; 0 బంతుల్లో 1x4, 4x6)  మెరుపు షాట్లతో అలరించాడు. జగదీశ్‌ సుచిత్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

డుప్లెసిస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

మధ్యాహ్నం మ్యాచ్‌ కావడంతో బెంగళూరు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనుకున్న ఓపెనింగ్‌ మాత్రం వారికి దక్కలేదు. జగదీషా సుచిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అతడు తడబడుతున్న సంగతి తెలిసిందే. పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ చేజార్చుకోవడంతో ఆర్సీబీ వెనబడుతుందేమో అనిపించింది! కానీ డుప్లెసిస్‌, రజత్‌ పాటిదార్‌ మెరుపు షాట్లు ఆడుతూ దుమ్మురేపారు. 6.5 ఓవర్లకే 50 పరుగులు చేసేశారు. డుప్లెసిస్‌ 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 105 రన్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ సాధించారు. 12.2వ బంతిని భారీ షాట్‌ ఆడబోయి రజత్‌ ఔటయ్యాడు. దాంతో మాక్సీతో కలిసి డుప్లెసిస్‌ చెలరేగాడు. మూడో వికెట్‌కు 37 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో డీకే 3 సిక్సర్లు, 1 బౌండరీ కొట్టడంతో స్కోరు 192/3కు చేరుకుంది.

Published at : 08 May 2022 05:26 PM (IST) Tags: IPL Virat Kohli IPL 2022 royal challengers bangalore Sunrisers Hyderabad Kane Williamson Wankhede Stadium faf duplessis ipl 2022 new srh vs rcb srh vs rcb highlights

ఇవి కూడా చూడండి

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024: ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

IPL 2024:  ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

Hardik Pandya: ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా! , ఐపీఎల్‌ చరిత్రలో భారీ ట్రేడ్‌ జరుగుతుందా?

Hardik Pandya: ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా! , ఐపీఎల్‌ చరిత్రలో భారీ ట్రేడ్‌ జరుగుతుందా?

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
×