IPL 2022 Auction: టెక్నికల్ ప్లేయర్ అజింక్య రహానేను అంత తక్కువ ధరకు కొట్టేసిన కేకేఆర్, ఎందుకిలా !
Rahane Bought By KKR For 1 Crore Rupees: ఐపీఎల్ లో రూ.9.5 కోట్లు ఓ సీజన్లో అందుకున్న అజింక్య రహానే తాజా వేలంలో రూ.1 కోటి ధరకు పడిపోయాడు. ఐపీఎల్ 2022 వేలంలో కేకేఆర్ రహానేను తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం (IPL 2022 Mega Auction)లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమిండియా క్రికెటర్ అజింక్య రహానేను అతి తక్కువ ధరకే తీసుకుంది. గతంలో తరహాలో ప్రదర్శన చేయకపోవడం, టీమిండియాలోనూ కొన్ని నెలలుగా వరుసగా విఫలం అవుతున్న రహానేను కొనడానికి ఏ జట్టు ముందుకు రాలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్ బేస్ ప్రైస్ రూ.1 కోటికి రహానేను దక్కించుకుంది. కేకేఆర్ ఫ్రాంచైజీ బేస్ ప్రైస్‌కు రహానేను తీసుకోవడానికి ఓకే చేయగా, ఇతర ఏ ఫ్రాంచైజీ బిడ్డింగ్ చేయలేదు.
Next under the hammer is @ajinkyarahane88 and he is SOLD to @KKRiders for INR 1 crore #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 13, 2022
ఇప్పటికే కేకేఆర్ ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ను రూ.12.25 కోట్ల భారీ ధరకు తీసుకుంది, నితీశ్ రాణాకు సైతం రూ.8 కోట్లు వెచ్చించిన కేకేఆర్ రహానేను లక్కీగా అతి తక్కువ ధరకే దక్కించుకుంది. అయితే టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే క్రికెటర్ రహానే కేవలం రూ.1 కోటి ధరకు పడిపోవడం దారుణం. 14 ఏళ్ల కిందట 12 లక్షల రూపాయలకు 2008లో ఐపీఎల్ తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆపై అంచెలంచెలుగా ఎదిగిన రహానే 9.5 కోట్లకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. నేడు మళ్లీ 1 కోటి రూపాయలకు పడిపోయాడు. కొన్ని నెలలు సరైన ప్రదర్శన చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం.
151 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రహానే 31.53 సగటు 121.34 స్ట్రైక్ రేట్‌తో 3941 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు, 1 ఐపీఎల్ శతకం (2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై) సాధించాడు. 2008లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 12 లక్షలకు రహానేకు ఛాన్స్ ఇవ్వగా.. 2009లోనూ అదే ధరకు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ సీజన్ 3లో 2011లో 2 కోట్లకు కొనుగోలు చేసింది. నిలకడగా ప్రదర్శన చేసిన రహానే 2014లో ఏకంగా 7.5 కోట్ల భారీ ధర పలికాడు. రాజస్తాన్ ఫ్రాంచైజీ 2015లోనూ అదే మొత్తాన్ని రహానే అందించింది.
2016లో కొత్తగా ఏర్పడిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రహానే 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ మరుసటి ఏడాది అంటే 2017లో తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక మొత్తం 9.5 కోట్లకు అందుకున్నాడు. కానీ మ్యాచ్ ఫలితాల కారణంగా మరుసటి ఏడాది 4 కోట్లకు 2018లో రాజస్తాన్ రాయల్స్ మరో చాన్స్ ఇచ్చింది. మరుసటి సీజన్లోనూ అదే మొత్తం అందుకున్నాడు. ఢిల్లీ క్యాపటల్స్ పై శతకం సాధించినా మరుసటి ఏడాది చాన్స్ దక్కలేదు.
2020లో ఢిల్లీ క్యాపిటల్స్ 5.25 కోట్ల రూపాయలకు తీసుకుంది. ఆ మరుసటి ఏడాది సైతం అంతే మొత్తం అందుకున్న రహానే ఆటలో దారుణంగా విఫలమయ్యాడు. అతడి ప్రదర్శన సరిగా లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రహానేను వేలంలోకి రిలీజ్ చేసింది. నేడు బెంగళూరు వేదికగా రెండో రోజు జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో బేస్ ప్రైస్ రూ.1 కోటికి కేకేఆర్ జట్టు రహానేను తీసుకుంది.
Also Read: IPL 2022 Auction: గంభీర్ వ్యూహాలకు ఫిదా! లక్నోను నిజంగానే 'సూపర్ జెయింట్' చేశాడు!
Also Read: IPL Auction 2022: రూ.20L నుంచి రూ.2.6 కోట్లకు - అభినవ్ సదరంగాని కోసం ఎందుకింత పోటీ!