CSK vs LSG Match Highlights: వాటే థ్రిల్లర్! ధోనీ, జడ్డూ, బ్రావో ట్రైచేసినా KL సేనే గెలిచింది! 211ను ఊచ్చేశారు
CSK vs LSG, IPL 2022: లీగు హిస్టరీలోనే చెన్నై సూపర్‌కింగ్స్ వరుసగా తొలి రెండు మ్యాచులను ఓడిపోయింది. ఆ జట్టును నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
IPL 2022: LSG won the match by 6 wickets against CSK in Match 7 at Braboune Stadium: ఐపీఎల్ చరిత్రలోనే అన్‌బిలీవబుల్ సీన్స్ చూశాం. లీగు హిస్టరీలోనే చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Superkings) వరుసగా తొలి రెండు మ్యాచులను ఓడిపోయింది. ఆ జట్టును నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఛేదనలో కేఎల్ రాహుల్ (KL Rahul), డికాక్ (Quinton De cock), లూయిస్ (Evin Lewis), ఆయుష్ బదోనీ (Aysh badoni) అద్భుతంగా ఆడారు. అంతకు ఉందు సీఎస్‌కేలో రాబిన్ ఉతప్ప (Robin Uthappa) అర్ధశతకం చేశాడు. శివమ్ దూబె (Shivam Dube), మొయిన్ అలీ (Moeen Ali) రాణించారు. టార్గెట్‌ను కాపాడుకోవడానికి ఎంఎస్ ధోనీ (MS Dhoni), జడేజా (Ravindra Jadeja), డ్వేన్ బ్రావో (Dwane Bravo) ఎంతగానో ప్రయత్నించారు.
LSG ఆఖరి వరకు థ్రిల్లరే
ముందున్న టార్గెట్ 211. స్టేడియంలో డ్యూ ఉంది. దాంతో రెండు జట్లూ భయం భయంగానే మైదానంలో అడుగుపెట్టాయి. తొలి రెండు ఓవర్లలో లక్నోకు పెద్దగా పరుగులేమీ రాలేదు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (40; 26 బంతుల్లో 2x4, 3x6), క్వింటన్ డికాక్ (61; 45 బంతుల్లో 9x4) ఆడిన తీరు మాత్రం అద్భుతం. మరీ భీకరంగా ఏమీ ఆడలేదు. సింపుల్‌గా, క్లాస్‌గా బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. దాంతో 10 ఓవర్లకు స్కోరు 98కి చేరుకుంది. అదే ఓవర్లో డికాక్ హాఫ్ సెంచరీ చేశాడు. మ్యాచ్ జోరుగా సాగుతున్న సమయంలో ప్రిటోరియస్ వేసిన 10.2వ బంతిని రాహుల్ కూర్చొని ఆడి అంబటి రాయుడుకు క్యాచ్ ఇచ్చాడు. మరికాసేపటికే మనీశ్ పాండే (5)ను తుషార్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో ఎవిన్ లూయిస్ (55; 23 బంతుల్లో 6x4, 3x6)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన డికాక్‌ను 14.4వ బంతికి ప్రిటోరియస్ ఔట్ చేశాడు. దాంతో 15 ఓవర్లకు లక్నో 144/3తో నిలిచింది. దీపక్ హుడా (13, 8 బంతుల్లో 1x4, 1x6) కాసేపు లూయిస్‌కు అండగా నిలిచాడు. 171 వద్ద అతడు ఔటయ్యాక ఎల్‌ఎస్‌జీ చేయాల్సిన రన్‌రేట్ పెరిగింది. 12 బంతుల్లో 34 అవసరమైన క్రమంలో.. శిమ్ దూబె వేసిన 19 ఓవర్లో లూయిస్ వరుసగా 4,4,6, బదోనీ (19; 9 బంతుల్లో 2x6) ఓ సిక్సర్ బాదేసి 25 పరుగులు రాబట్టారు. దాంతో ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా బదోనీ వరుసగా రెండు సిక్సర్లు బాదేసి విజయం అందించారు.
CSK దంచుడే దంచుడు
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి లక్నో బౌలర్ల తప్పిదాలు అనుకూలంగా మారాయి. డ్యూ ఫ్యాక్టర్‌కు తోడు పవర్‌ప్లేలో సరైన లెంగ్తుల్లో వేయకపోవడంతో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (50; 27 బంతుల్లో 8x4, 1x6) చుక్కలు చూపించాడు. తన వింటేజ్ ఆటను బయటకు తీసుకొచ్చాడు. మరో ఓపెనర్ రుతురాజ్ (1) రనౌటైనా హాఫ్ సెంచరీ కొట్టేశాడు. అతడికి తోడుగా మొయిన్ అలీ (35; 22 బంతుల్లో 4x4, 2x6) సైతం దంచికొట్టడంతో సీఎస్‌కే 4.4 ఓవర్లకే 50 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఉతప్పను 7.3వ బంతికి బిష్ణోయ్ ఎల్బీ చేశాడు. కానీ శివమ్ దూబె (49; 30 బంతుల్లో 5x4, 2x6) బాదుడు షురూ చేశాడు. మరికాసేపటికే మొయిన్ ఔటైనప్పటికీ అంబటి రాయుడు (27; 20 బంతుల్లో 2x4, 2x6)తో కలిసి దూబె విజృంభించాడు. ఇద్దరూ సిక్సర్లు బాదేయడంతో 15.2 ఓవర్లకే స్కోరు 150 చేరుకుంది. జట్టు స్కోరు 166 వద్ద రాయుడిని బిష్ణోయ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. హాఫ్ సెంచరీకి 1 పరుగు ముందు దూబెను అవేశ్ పెవిలియన్ పంపించాడు. కానీ ఆఖర్లో జడ్డూ (17; 20 బంతుల్లో 3x4) అండతో ఎంఎస్ ధోనీ (16; 6 బంతుల్లో 2x4, 1x6) ఒక సిక్స్, 2 బౌండరీలు బాదడంతో సీఎస్‌కే స్కోరు 210/7కు చేరుకుంది. బిష్ణోయ్ (2/24) ఆకట్టుకున్నాడు. అశేవ్, ఆండ్రూ టై చెరో 2 వికెట్లు తీశారు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗪𝗜𝗡! 👌 👌
— IndianPremierLeague (@IPL) March 31, 2022
A mighty batting performance from @LucknowIPL to seal their maiden IPL victory. 👏 👏 #TATAIPL | #LSGvCSK
Scorecard ▶️ https://t.co/uEhq27KiBB pic.twitter.com/amLhbG4w1L