Rajat Patidar: 'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్
Rajat Patidar: రజత్ పాటిదార్! ఒక్క రోజులోనే హీరోగా అవతరించాడు. ఐపీఎల్ 2022 మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన అతడే ఇప్పుడు 'అన్‌టోల్డ్ స్టోరీ' అయ్యాడు. ఇంతకీ అతడి స్పెషాలిటీ ఏంటి?
Who is Rajat Patidar The man of the moment for RCB: రజత్ పాటిదార్! ఒక్క రోజులోనే హీరోగా అవతరించాడు. క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిపోయాడు. దిగ్గజాలు చేయలేని పనిని చాకచక్యంగా పూర్తిచేశాడు. అత్యంత ఒత్తిడితో కూడిన ఎలిమినేటర్లో సీనియర్లు చేతులెత్తేసిన వేళ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ ట్రోఫీ ఆశలను పదిలంగా ఉంచాడు. ఐపీఎల్ 2022 మెగావేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన అతడే ఇప్పుడు 'అన్‌టోల్డ్ స్టోరీ' అయ్యాడు. ఇంతకీ ఎవరీ రతజ్ పాటిదార్?
లక్నోతో ఎలిమినేటర్ మ్యాచులో ఆర్సీబీ తొలి ఓవర్లోనే కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ చేజార్చుకొని ఒత్తిడిలో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ (Rajat Patidar) అద్భుతమే చేశాడు. అంచనాలే లేని అతడు సంచలనంగా మారాడు. విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్న వేళ 200 స్ట్రైక్‌రేట్‌తో సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టాడు. 72 పరుగుల వద్ద లభించిన జీవనదానాన్ని సద్వినియోగం చేసుకొని అజేయ శతకంతో నిలిచాడు. 54 బంతుల్లోనే 12 బౌండరీలు, 7 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 207.41గా ఉందంటేనే అతడెలా ఆడాడో అర్థమవుతోంది. దాదాపుగా ఆశల్లేని బెంగళూరు ఎలిమినేటర్లో గెలిచిందంటే అతడి చలవే!
ఐపీఎల్ 2022లో రజత్ పాటిదార్ ఆడటమే ఒక విచిత్రం! ఎందుకంటే మెగావేలంలో అతడిని ఏ జట్టూ తీసుకోలేదు. గతేడాది తమకే ఆడినప్పటికీ ఆర్సీబీ కనీసం ఆసక్తి చూపించలేదు. ఆ జట్టులో లవ్‌నీత్ సిసోడియా గాయపడటం అతడికి వరంగా మారింది. రూ.20 లక్షలతో మళ్లీ బెంగళూరే ఒప్పందం కుదుర్చుకుంది. వారు చూపించిన నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడు. కీలకమైన ఎలిమినేటర్లో సెంచరీతో ట్రోఫీ ఆశలను పదిలంగా మార్చేశాడు.
దేశవాళీ క్రికెట్లో రజత్ పాటిదార్ మధ్యప్రదేశ్‌కు ఆడతాడు. 39 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో 2500 పరుగులు చేశాడు. 43 లిస్ట్ ఏ, 38 టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఈ మధ్యే టీ20ల్లో 34.42 సగటు, 142.53 స్ట్రైక్‌రేట్‌తో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఎలిమినేటర్ మ్యాచుకు ముందు కెరీర్లో ఒక్క శతకమైనా కొట్టలేదు. అలాంటిది అంతర్జాతీయ స్థాయి, అత్యంత ఒత్తిడితో కూడిన నాకౌట్‌లో ఆ ఘనత అందుకున్నాడు.
💬 💬 "Haven't seen many better innings than the one Rajat played."
— IndianPremierLeague (@IPL) May 26, 2022
DO NOT MISS: @imVkohli chats with the man of the moment, Rajat Patidar, after @RCBTweets' win over #LSG in Eliminator. 👏 👏 - By @RajalArora
Full interview 📹 🔽 #TATAIPL | #LSGvRCBhttps://t.co/ofEtg6I3Ud pic.twitter.com/TG8weOuZUo
A special knock calls for a special interview. 👏 👏
— IndianPremierLeague (@IPL) May 25, 2022
On the mic with Rajat Patidar & @imVkohli. 👍👍
Coming 🔜 on https://t.co/4n69KTTxCB
STAY TUNED! ⌛#TATAIPL | #LSGvRCB pic.twitter.com/BPMnBoV1Ds
Talk about earning plaudits! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 25, 2022
Twitterati was abuzz after that special knock from Rajat Patidar at the Eden Gardens. 👍 👍#TATAIPL | #LSGvRCB pic.twitter.com/GuZ8iX6L3Z