అన్వేషించండి

KKR Vs SRH Highlights: రైజర్స్‌పై రైడర్స్ విక్టరీ - వరుసగా ఐదో ఓటమి - ఇక ప్లేఆఫ్స్‌కు కష్టమే!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్‌లో శనివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ విజయం సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా ఐదో ఓటమి. దీంతో వారు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా రెండు మ్యాచ్‌లు కచ్చితంగా గెలవడంతో పాటు మిగిలిన జట్ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాలి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 177 పరుగులు సాధించింది. అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 123 పరుగులకు పరిమితం అయింది.దీంతో కోల్‌కతా 54 పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో నైట్‌రైడర్స్ ప్లేఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. వారి నెట్ రన్‌రేట్ కూడా భారీగా మెరుగయంది.

సిక్సర్లతో చెలరేగిన కోల్‌కతా బ్యాటర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడానికి నిర్ణయించుకున్న కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 17 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ అజింక్య రహానే (28: 24 బంతుల్లో, మూడు సిక్సర్లు), నితీష్ రాణా (26: 19 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగిపోయారు. వీరి బ్యాటింగ్‌తో పవర్‌ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.

ఈ జోడి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక ఉమ్రాన్ మాలిక్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసి సన్‌రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ తర్వాతి ఓవర్లో శ్రేయస్ అయ్యర్‌ను (15: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుట్ చేశాడు. దీంతో కోల్‌కతా 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో  రింకూ సింగ్‌ను (5: 6 బంతుల్లో) నటరాజన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

ఇక్కడ్నుంచి ఆండ్రీ రసెల్ (49 నాటౌట్: 28 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), శామ్ బిల్లింగ్స్  (34: 29 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కోల్‌కతా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 63 పరుగులు జోడించారు. భువీ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి శామ్ బిల్లింగ్స్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో ఆండ్రీ రసెల్ మూడు సిక్సర్లు కొట్టడంతో కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సన్‌‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా... భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, నటరాజన్‌లకు తలో వికెట్ . కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉండగా... సిక్సర్లు మాత్రం 11 ఉండటం విశేషం.

కలిసికట్టుగా విఫలం
అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (43: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్‌ల (32: 25 బంతుల్లో, మూడు సిక్సర్లు) తర్వాత అత్యధిక స్కోరు 11 పరుగులంటేనే అర్థం చేసుకోవచ్చు ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో. కేన్ విలియమ్సన్ (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), రాహుల్ త్రిపాఠి (9: 12 బంతుల్లో, ఒక ఫోర్), నికోలస్ పూరన్ (2: 3 బంతుల్లో) ఇలా బ్యాట్స్‌మెన్ అందరూ సమిష్టిగా విఫలం అయ్యారు.

కోల్‌కతా బౌలర్లలో రసెల్ మూడు వికెట్లు తీసుకోగా... టిమ్ సౌతీకి రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్‌లకు తలో వికెట్ దక్కింది.

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget