By: ABP Desam | Updated at : 08 May 2022 07:11 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
(Image Credits: IPL)
ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంలో ఉండగా... చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు చేరడానికి చెన్నైకి ఇంకా ఒక్క శాతం అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి చెన్నై విజయం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తుంది.
ఈ రెండు జట్లూ ఇంతవరకు 26 సార్లు తలపడగా... చెన్నై సూపర్ కింగ్స్ 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఢిల్లీకి 10 విజయాలు దక్కాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్‌లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే కీలకం కానున్నారు. ముఖ్యంగా ధోని కెప్టెన్సీ తీసుకున్నాక డెవాన్ కాన్వే వేగంగా ఆడుతూ చెలరేగిపోతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రేవో, సిమర్‌జిత్ సింగ్, మహీష్ థీక్షణ, ముకేష్ చౌదరి
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
డేవిడ్ వార్నర్, కేఎస్ భరత్, మిషెల్ మార్ష్, రిషబ్ పంత్, రొవ్‌మన్ పావెల్, రిపల్ పటేల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఆన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్
Hello and welcome to Match 55 of #TATAIPL #CSK will take on #DelhiCapitals at the DY Patil Stadium.#CSKvDC pic.twitter.com/pKBF4xc768
— IndianPremierLeague (@IPL) May 8, 2022
KKR vs LSG: క్రికెట్ కాదు LSGతో బాక్సింగ్ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!
KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
LSG vs KKR: తొలి వికెట్‌కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్‌ను చూస్తామా?
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Human Rights Violations in USA: అమెరికాలో జాతి విద్వేషం- ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరిపై అత్యాచారం, మరెన్నో!
Anantapur TDP : అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?
YSRCP Politics : సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !