By: ABP Desam | Updated at : 15 Apr 2022 05:34 PM (IST)
patric-farhart
IPL 2022 Delhi Capitals Physio, Patrick Farhart Isolated After Testing Positive for Covid-19, DC vs RCB Doubtful: ఐపీఎల్ 2022కు ఎదురుదెబ్బ! ఐపీఎల్ బయో బుడగలోకి కరోనా వైరస్ ఎంటరైంది. దిల్లీ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దిల్లీ క్యాపిటల్స్ వైద్యబృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు పంపించింది. దీంతో శనివారం జరగాల్సిన దిల్లీ, బెంగళూరు మ్యాచుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగు 15వ సీజన్లో వైరస్ కలకలం రేగడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఫర్హర్ట్‌కు ఏమైనా లక్షణాలు ఉన్నాయా లేవా అన్న సంగతి బయటకి రాలేదు. ఆయన కోలుకొని తిరిగి వచ్చేంత వరకు అసిస్టెంట్ ఫిజియో ధనంజయ కౌషిక్ జట్టుకు సేవలు అందించనున్నారు. నిబంధనల ప్రకారం ఫర్హర్ట్ ఇప్పట్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటారు. ఆరో రోజు, ఏడో రోజు ఆయనకు కొవిడ్ టెస్టులు నిర్వహిస్తారు. 24 గంటల వ్యవధిలో రెండుసార్లు నెగెటివ్ వస్తేనే బయో బుడగలోకి ఆయన తిరిగి ప్రవేశిస్తారు.
శనివారం రాత్రి 7:30 గంటలకు దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మరి దిల్లీ ఆటగాళ్లతో క్లోజ్‌గా ఉండే ఫిజియోకు కొవిడ్ రావడంతో రేపటి మ్యాచుపై సందిగ్ధం నెలకొంది. బహుశా ఆటగాళ్లందరికీ నేడు కొవిడ్ టెస్టులు చేయిస్తుండొచ్చు. ఎవరికీ పాజిటివ్ రాకపోతే యథావిధిగా మ్యాచు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అలా కుదరకపోతే ఈ మ్యాచ్‌ను తర్వాత షెడ్యూలు చేస్తారు. అప్పటికీ కుదరకపోతే టెక్నికల్ కమిటీకి నివేదిస్తారు. ప్రస్తుతం బెంగళూరు 6 పాయింట్లు, దిల్లీ 4 పాయింట్లతో వరుసగా 6,7 స్థానాల్లో ఉన్నాయి.
🚨 NEWS 🚨: Deepak Chahar ruled out of #TATAIPL 2022, Harshit Rana joins Kolkata Knight Riders as a replacement for Rasikh Salam.
More Details 🔽https://t.co/HbP0FKpyhA — IndianPremierLeague (@IPL) April 15, 2022
మరోవైపు దీపక్ చాహర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. వెన్నెముకకు గాయం కావడమే ఇందుకు కారణం. కోల్‌కతా యువ పేసర్ రసిక్ సలామ్ వెన్నెముక దిగువ భాగంలో గాయం కావడంతో అతడూ లీగుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణాను కేకేఆర్ తీసుకుంది. దిల్లీకి చెందిన ఈ కుర్రాడిని రూ.20 లక్షల కనీస ధరతో తీసుకుంది.
దీపక్ చాహర్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొడతాడు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగుకు వచ్చి కీలక పరుగుల్ని చేస్తాడు. ఈ సీజన్లో అతడు లేకపోవడంతో చెన్నైకి ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచుల్లో పవర్‌ప్లేలో 24 ఓవర్లు వేసిన సీఎస్‌కే బౌలర్లు 8.62 ఎకానమీతో కేవలం 2 వికెట్లు తీశారు. డెత్‌లోనూ వారి బౌలింగ్ చెత్తగా ఉంటోంది.
Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?
Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ ప్రమోషన్! ఐర్లాండ్ టూర్లో టీమ్ఇండియాకు కెప్టెన్సీ!!
Rajat Patidar: 'అన్‌సోల్డ్'గా మిగిలి 'అన్‌టోల్డ్ స్టోరీ'గా మారిన రజత్ పాటిదార్
LSG vs RCB, Eliminator: లక్నో నాకౌట్‌కు 5 కారణాలు - ఆ ఒక్కటే 90% ఓడించింది!
LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్ చేసిన RCB - రాహుల్ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు