అన్వేషించండి

మ్యాచ్‌లు

DC vs PBKS, IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా - పంజాబ్‌తో మ్యాచ్ వేదికను మార్చుతూ కీలక నిర్ణయం

DC vs PBKS match venue changed: ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ వేదికను పుణె నుంచి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియానికి మార్చారు.

IPL 2022: DC vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదివరకే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ ఫిజియోకు కరోనా సోకగా.. ఆపై మిచెల్ మార్ష్‌ అనే ఆటగాడికి కోవిడ్19 సోకినట్లు నిర్ధారించారు. మరో ముగ్గురు సభ్యులకు సైతం కరోనా పాజిటివ్ అని ఆర్‌టీపీసీఆర్ టెస్టులో తేలింది. ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, సిబ్బంది పుణె ప్రయాణం వాయిదా వేసుకోవడం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ వేదికను పుణె నుంచి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియానికి (DC vs PBKS match venue changed from pune to Mumbai brabourne stadium) మార్చారు. ఢిల్లీ జట్టులో కరోనా కేసులు రావడంతో ప్రయాణం చేయడం కంటే ముంబైలో ఉన్నవారిని అక్కడే ఉంచి మ్యాచ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఐపీఎల్ 15 సీజన్ షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఏప్రిల్ 20న జరగనుంది.

DC vs PBKS, IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు కరోనా - పంజాబ్‌తో మ్యాచ్ వేదికను మార్చుతూ కీలక నిర్ణయం

పుణె ప్రయాణం వాయిదా.. నేడు వేదిక మార్పు
ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, సిబ్బంది పుణె ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఓ ఆటగాడికి పాజిటివ్ రాగా, జట్టు మొత్తం క్వారంటైన్‌కు వెళ్లింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించి తదుపరి ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్లేయర్ కరోనా బారిన పడటంతో మిగతా ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధంటా ఉంటారా లేదా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా కరోనా కేసు నమోదైంది.

ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా సోకింది వీరికే..
1. పాట్రిక్ ఫర్హాత్ - ఫిజియోథెరపిస్ట్ (ఏప్రిల్ 15న కరోనా పాజిటివ్)
2. చేతన్ కుమార్ - స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ (ఏప్రిల్ 16న కరోనా పాజిటివ్)
3.  మిచెల్ మార్ష్ - ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)
4. అభిజిత్ సాల్వి – టీమ్ డైరెక్టర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)
5. ఆకాష్ మనె – సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్ (ఏప్రిల్ 18న కరోనా పాజిటివ్)

పాయింట్ల పట్టికలో 8వ స్థానం..
రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్‌లో ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 2 విజయాలతో 8వ స్థానానికి పరిమితమైంది.

Also Read: RR vs KKR, Match Highlights: బట్లర్ సెంచరీ, చాహల్ హ్యాట్రిక్ - థ్రిల్లర్‌లో రాజస్తాన్ విక్టరీ!

Also Read: Covid-19 Hits IPL 2022: ఐపీఎల్‌లో కరోనా కలకలం, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్ - ఆ మ్యాచ్ డౌటేనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget