అన్వేషించండి

SRH vs LSG Match Updates: ఉప్పల్ వర్షం పడితే సీఎస్కేకు చెమటలు - హైదరాబాద్‌ మ్యాచ్ జరుగుతుందా?

Telugu News: హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన వర్షం చెన్నైను టెన్షన్ పెడుతోంది. ఇవాళ కూడా వర్షం కురిసి హైదరాబాగ్‌, లక్నో మధ్య జరిగే మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటోంది.

IPL 2024: నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది. దాదాపు ఐదు గంటల పాటు పడిన వానతో సిటీ మొత్తం తడిసి ముద్దైంది. ప్రత్యేకించి ఐపీఎల్‌లో ఈ రోజు మ్యాచ్ చాలా క్రూషియల్. ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు రాత్రికి జరగాల్సిన SRH వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని రెండు టీమ్స్ భావిస్తున్నాయి. 

పైగా ఇవాళ SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బర్త్ డే కాబట్టి పుట్టినరోజు నాడు సైలెన్సర్ LSG ని సైలెంట్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా మంచి ఎక్స్ పెక్టెషన్స్‌తో ఉన్నారు ఈ రోజు మ్యాచ్‌పై. ఇలాంటి టైమ్‌లో రాత్రి కురిసిన భారీ వర్షం ఉప్పల్ స్టేడియాన్ని ముంచేసింది. కవర్లు కప్పి ఉంచినా భారీగా ఈదురుగాలులు రావటంతో పిచ్ మొత్తంగా బురదగా మారింది. 

ఉదయానికి వర్షం ఆగటం.. మ్యాచ్‌కు ఇంకా 12గంటల సమయం ఉండటంతో పిచ్‌ను మళ్లీ రెడీ చేసేందుకు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కృషిచేస్తున్నారు. బట్ మళ్లీ వర్షం పడితే మాత్రం పరిస్థితి గందరగోళమే. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఓవర్లు కుదించి ఏదో ఫలితం తేలినా పర్లేదు కానీ మ్యాచ్ రద్దైతే మాత్రం ఐపీఎల్ రూల్స్ ప్రకారం రెండు టీమ్‌లకు చెరో పాయింట్ వస్తుంది. 

ఇప్పటికే 12పాయింట్లతో ఉన్న LSG, SRHలు 13పాయింట్లకు చేరుకుని మిగిలిన ఉన్న రెండు మ్యాచులు కచ్చితంగా గెలిచి తీరాల్సిన సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. కానీ రిస్క్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌కి. మ్యాచ్ జరిగి ఏదో ఒక ఫలితం తేలితే..మూడో క్వాలిఫైయర్ బెర్త్‌కి SRH, LSGల్లో ఏదో ఒకటి టెండర్ వేస్తుంది. ఇక మిగిలిన నాలుగో బెర్త్ కోసం CSK ట్రై చేసుకోవచ్చు. 

కానీ మ్యాచ్ రద్దై టీమ్‌కు చెరో పాయింట్ వస్తే మాత్రం ఆ రెండు టీమ్స్‌లో ప్లే ఆఫ్స్‌లో ముందడుగు వేస్తాయి. కాబట్టి తమకున్న మ్యాచుల్లో ఓడిపోతే క్వాలిఫైయర్స్ రేసులో CSK వెనకబడుతుంది. అందుకే ఉప్పల్ లో వానపడితే సీఎస్కేకు చెమటలు పడుతున్నాయి.

హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది?
హైదరాబాద్‌లో వాతావరణం చూసుకుంటే ప్రస్తుతానికి ఎండగా ఉంది కానీ సాయంత్రానికి మేఘావృతమవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటే.. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే పరిస్థితి లేదని చెబుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget