GT Vs RR: గుజరాత్‌పై టాస్ గెలిచిన సంజు - మొదట బౌలింగే!
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 20వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటింగ్‌కు దిగనుంది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, జయంత్ యాదవ్, నూర్ అహ్మద్, శ్రీకర్ భరత్, దాసున్ షనక
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ, జో రూట్
గడిచిన ఏడాదిన్నర రెండేండ్లుగా భారత క్రికెట్ లో తాను ఆడినా ఆడకున్నా చర్చలోకి వస్తున్న క్రికెటర్ సంజూ శాంసన్. టాలెంట్ టన్నుల కొద్దీ ఉన్నా అదృష్టం అవిసెగింజంత కూడా లేని ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ జాతీయ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. కారణాలేవైనా 30 ఏండ్లకు దగ్గర్లో ఉన్నా ఇప్పటికీ అతడికి టీమిండియాలో పర్మనెంట్ ప్లేస్ లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, అభిమానులంతా ‘మిస్టర్ 360’ అని పిలుచుకునే ఏబీ డివలియర్స్ మాత్రం శాంసన్ ఏదో ఒకరోజు భారత జట్టుకు సారథి అవుతాడని చెబుతుండటం విశేషం.
2021 నుంచి ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథిగా ఉన్న సంజూ.. గత సీజన్‌లో తన టీమ్‌ను ఫైనల్స్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో కూడా టైటిల్ ఫేవరెట్లలో రాజస్తాన్ రాయల్స్ ఒకటిగా ఉంది. తాజాగా ఇదే విషయమై డివిలియర్స్ స్పందిస్తూ... ‘సంజూ చాలా గొప్ప ఆటగాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ అతడి కెప్టెన్సీ ఎలా ఉంటుంది..? అంటే నాకు మొదట గుర్తొచ్చేది సంజూ ప్రశాంతత. ఫీల్డ్ లో శాంసన్ చాలా రిలాక్స్డ్‌గా ఉంటాడు. కెప్టెన్‌గా ఉండి ఏదో వ్యూహం రచిస్తున్నట్టుగా ఎప్పుడూ కనిపించడు. నేనైతే సంజూను అలా ఎప్పుడూ చూడలేదు. సారథికి ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇది కీలకం. వ్యూహాత్మకంగా శాంసన్ వేరే లెవల్‌లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో అతడు మరింత రాటుదేలుతాడు. జోస్ బట్లర్ వంటి అనుభవజ్ఞుడితో గడుపుతుండటం శాంసన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. బట్లర్ రాజస్తాన్ కు విలువైన ఆస్తి..’అని చెప్పాడు.
‘కెప్టెన్ అవడానికి అన్ని అర్హతలను అతడు సాధించాడని నేను భావిస్తున్నా. ఎవరికి తెలుసు..? రాబోయే రెండు మూడేండ్లలో ఏదో ఒకరోజు శాంసన్ భారత జట్టుకు కెప్టెన్ గా ఉంటాడు. అతడి క్రికెట్ ను మంచి ప్రపంచంగా ఉండనీయండి..’అని డివిలియర్స్ జియో సినిమాతో జరిగిన చర్చలో భాగంగా తెలిపాడు.