IPL 2024: గుజరాత్-బెంగళూరు మ్యాచ్, రికార్డులు ఎవరివైపు అంటే?
IPL 2024 GT vs RCB: గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 3 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు ఒక మ్యాచ్‌లో గెలిచింది.
GT vs RCB IPL 2024 Head to Head Records : ఐపీఎల్(IPL) 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 జరగనుంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడి ఓడిన గుజరాత్.. ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఈ ఐపీఎల్‌లో 300 పరుగులకుపైగా చేశారు. కానీ గుజరాత్ మిడిల్ ఆర్డర్ ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. డేవిడ్ మిల్లర్ (138 పరుగులు), షారుక్ ఖాన్ (30), విజయ్ శంకర్ (73), రాహుల్ తెవాటియా (153) పరుగులు చేసినా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. బెంగళూరు గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి మళ్లీ గెలుపు బాట పట్టింది.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 3 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు ఒక మ్యాచ్‌లో గెలిచింది.
బెంగళూరు గాడిన పడేనా..?
బెంగళూరు జట్లను బలహీనమైన బౌలింగ్ వేధిస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు రాణించినా ఈ సీజన్‌లోని గత మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 20 పరగులు మాత్రమే ఇచ్చాడు. సిరాజ్ ఒక్క వికెట్ తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. యష్ దయాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ, పార్ట్ టైమ్ పేసర్ గ్రీన్ కూడా రాణించండం బెంగళూరుకు బలంగా మారింది.
పిచ్ నివేదిక
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్ బౌలింగ్‌కు సహకరిస్తుంది. ఇక్కడ వన్డేల్లో సగటు స్కోరు ఓవర్‌కు 5 పరుగుల కంటే తక్కువ. ముఖ్యంగా IPLలో ఇక్కడ ఛేదన చేసే జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అహ్మదాబాద్‌లో మ్యాచ్ ప్రారంభమైనప్పుడు ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉండొచ్చని అంచనా. వర్షం పడే అవకాశం లేదు. గాలిలో తేమ శాతం 22 ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు( అంచనా): వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ
రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తుది జట్టు( అంచనా): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ , కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్