IPL 2024: చెపాక్ వేదికగా సీఎస్కేతో మ్యాచ్, బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్
IPL 2024, CSK vs RR : ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై బౌలింగ్ కు దిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ నెగ్గి తొలి బ్యాటింగ్ ఎంచుకున్నాడు
CSK vs RR Rajasthan Royals opt to bat: : ఐపీఎల్(IPL)లో ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టేందుకు రాజస్థాన్(RR).... ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(CSK).... కీలక మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు . ఈ మ్యాచ్ లో సీఎస్కే తరఫున మళ్లీ రచిన్ రవీంద్ర తుది జట్టులోకి వచ్చాడు. సొంత మైదానం చెపాక్‌లో రాజస్థాన్‌పై గెలిచి సత్తా చాటాలని చెన్నై భావిస్తోంది.
ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో మిగిలిన చివరి రెండు మ్యాచ్‌లను ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాజస్థాన్‌పై గెలిచి ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టం చేసుకోవద్దనే పట్టుదలతో చెన్నై ఉంది. అయితే ఇప్పటికే కోల్‌కత్తా ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టగా.... ప్లే ఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా నిలవాలని రాజస్థాన్ భావిస్తోంది.
అపజయాలకు చెక్ పెట్టాలనుకుంటున్న రాజస్థాన్...
వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లో గెలిచి అపజయాల జైత్రయాత్రకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించలేకపోయిన ఓపెనర్ యశస్వి జైస్వాల్... టీ 20 ప్రపంచకప్ కోసం అమెరికాకు వెళ్లే ముందు తన సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. సంజు శాంసన్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఢిల్లీతో జరిగిన చివరి గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన హోమ్ గ్రౌండ్‌లో సత్తా చాటాలని చూస్తున్నాడు.
చెన్నైకి గెలవక తప్పని మ్యాచ్ ...
రాజస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు చాలా కీలకంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన చెన్నై... ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది.
పిచ్ రిపోర్ట్
చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. చెపాక్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 183 కాగా, ఈ సీజన్‌లో చెపాక్ పిచ్‌పై అత్యధిక లక్ష్య ఛేదన 213. అయితే ఇది మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా తేమ ప్రభావం ఉండదు కాబట్టే టాస్ ఇక్కడ కీలకం కాకపోవచ్చు న్నాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్ . పిచ్ మీద తేమ ప్రభావం ఉండదు. అయితే, వాతావరణం మారే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా పరిస్థితులకు అలవాటు పడి మ్యాచ్‌లో ఆధిక్యం సాధించాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ అభిప్రాయపడ్డాడు.
చెన్నై తుది జట్టు
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహీశ్ తీక్షణ
రాజస్థాన్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, శుభమ్ దూబె, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్