CSK Vs MI: చెపాక్‌లో చెన్నై విక్టరీ - ఆరు వికెట్లతో ఓడిపోయిన ముంబై!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లతో విజయం సాధించింది.
Chennai Super Kings vs Mumbai Indians: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (44: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై విషయానికి వస్తే నెహాల్ వధేరా (64: 51 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అత్యధిక స్కోరు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీష పతిరాణా నాలుగు ఓవర్లలో కేవలం 15 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో చెన్నై 13 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ముంబై ఇండియన్స్ పది మ్యాచుల్లో 5 విజయాలు, 5 ఓటములతో 10 పాయింట్లు సాధించి ఆరో స్థానంలోనే ఉంది.
పవర్‌ప్లేలోనే సూపర్ బ్యాటింగ్
140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (30: 16 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), డెవాన్ కాన్వే (44: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మొదటి వికెట్‌కు 4.1 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ పవర్ హిట్టింగ్ చేశాడు. ఆట తర్వాతి స్టేజ్‌లో ఇది చెన్నైకి బాగా హెల్ప్ అయింది. పరుగుల రాక మందగించినా కొట్టాల్సిన రన్ రేట్ పెరగలేదు.
కాసేపు వేగంగా ఆడిన అజింక్య రహానే (21: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. అంబటి రాయుడు (12: 11 బంతుల్లో, ఒక సిక్సర్) వైఫల్యాల పరంపర కొనసాగింది. శివం దూబే (26 నాటౌట్: 18 బంతుల్లో, మూడు సిక్సర్లు) చివర్లో సిక్సర్లతో చెలరేగడంతో చెన్నై సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది.
మరోసారి కొలాప్స్ అయిన ముంబై టాప్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి అచ్చిరాలేదు! పవర్‌ప్లే ముగిసే సరికే 34 పరుగులకు 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. దేశ్ పాండే వేసిన 2 ఓవర్ ఆఖరి బంతికి ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (6) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. రెండో బంతికి ఇషాన్ కిషన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను తీక్షణ అందుకున్నాడు. ఐదో బంతికి రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. వరుసగా రెండో మ్యాచులో డకౌట్ అయ్యాడు. అప్పటికి స్కోరు 14. ఈ సిచ్యువేషన్లో నేహాల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్ నిలిచారు. నిలకడగా ఇన్నింగ్స్ కొనసాగించారు. నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 54 రన్స్ పాట్నర్‌షిప్ అందించారు.
తొమ్మిది ఓవర్లకు 59/3తో ముంబయి స్ట్రాటజిక్ టైమౌట్‌కు వెళ్లింది. ఆ తర్వాతా పరిస్థితి ఏమీ మారలేదు. జట్టు స్కోరు 69 వద్ద సూర్యకుమార్‌ను జడ్డూ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ అండతో వధేరా ఇన్నింగ్స్ నడిపించాడు. ఐదో వికెట్‌కు 42 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 15.2 ఓవర్లకు జట్టు స్కోరును 100కు చేర్చారు. 46 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న వధేరా మరింత అగ్రెసిస్‌గా ఆడాడు. బౌండరీలు కొట్టాడు. స్కోరు పెంచే క్రమంలో జట్టు స్కోరు 123 వద్ద పతిరణ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. టిమ్ డేవిడ్ (2), అర్షద్ (1) త్వరగానే ఔటయ్యారు. దాంతో ముంబయి 139/8కి చేరింది.