IPL: వచ్చే ఏడాది నుంచి 8 జట్లు కాదు... 10 జట్లు... స్పష్టం చేసిన అరుణ్ ధుమాల్
IPL అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే 8 జట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న IPL వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో అభిమానులను మరింత అలరించనుంది.
IPL అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే 8 జట్లతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న IPL వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో అభిమానులను మరింత అలరించనుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ (BCCI) కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ICC Test Ranking: 18 స్థానాలు ఎగబాకిన సిరాజ్... కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంక్ స్థిరంగా
అంతేకాదు, ఈ ఏడాది IPL రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు కృషి చేస్తున్నామని ధుమాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో యూఏఈ (UAE) ప్రభుత్వ అనుమతి అవసరమన్నారు. ఎనిమిది జట్లతో లీగ్ ఆడటం ఇదే చివరిసారని ఆయన అన్నారు. IPL-2022 సీజన్ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ ఏర్పాట్లలో UAEలో బిజీగా ఉన్నారు.
Also Read: Modi: మన ఒలింపిక్స్ హీరోలతో మర్చిపోలేని రోజు... మోదీ షేర్ చేసిన వీడియో వైరల్
‘ఇప్పుడు అందరి చూపు UAEలో జరిగే IPL పైనే ఉంది. ఈ సీజన్ విజయవంతం అవుతుందని నమ్ముతున్నాం. ఏదేమైనా ఎనిమిది జట్లతో ఇదే చివరి సీజన్. వచ్చే ఏడాది నుంచి 10 జట్లు ఉంటాయి. ఇప్పుడు దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. 10 జట్లతో షెడ్యూల్, ఫ్రాంఛైజీల గురించి పని చేస్తున్నాం’ అని ధుమాల్ తెలిపారు. గతంలో 2011లో 10 జట్లతో లీగ్ నిర్వహించారు. 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాది డిసెంబర్లో భారీ వేలం ఉండొచ్చని అభిమానులకు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: Lionel Messi: వేలానికి మెస్సీ వాడిన టిష్యూ... ప్రారంభ ధర ఎంతో తెలుసా?
‘ఐపీఎల్ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలు టీకాలు వేయించుకోవడంతో యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి! ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం. మిగతాదంతా యూఏఈ ప్రభుత్వంపై ఆధారపడి ఉంది’ అని అరుణ్ ధుమాల్ అన్నారు.
Also Read: Virat Kohli: భారత పరుగుల యంత్రం కోహ్లీ @ 13 ఇయర్స్... కోహ్లీ గురించి 13 ఆసక్తికర విషయాలు