Rohit Sharma Record: ఐపీఎల్ లో రోహిత్ రికార్డు... ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఘనత
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఐపీఎల్ లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం ఓ ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ జట్టుపై 1000 పరుగులు దాటిన మొదటి బ్యాట్స్ మెన్ గా రోహిత్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) పై రోహిత్ శర్మ 1000కి పైగా పరుగులు చేశాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఇవాళ ముంబై కోల్ కతా మధ్య ఐపీఎల్ మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనతను సాధించాడు.
తిరిగి జట్టులోకి
గురువారం మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్ర వాల్సీ బౌలింగ్ లో చేసిన పరుగులతో వెయ్యి పరుగుల మైలు రాయిని దాటాడు. రోహిత్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన MI మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. కానీ KKR తో జరిగిన మ్యాచ్‌కు తిరిగి వచ్చాడు రోహిత్.
🚨 Landmark Alert🚨@ImRo45 becomes the first batsman to score 1⃣0⃣0⃣0⃣ runs or more against a team in the IPL. 👏 👏 #VIVOIPL #MIvKKR
— IndianPremierLeague (@IPL) September 23, 2021
Follow the match 👉 https://t.co/SVn8iKC4Hl pic.twitter.com/xU0er9xBcK
రెండో సీజన్ లో
యూఏఈ వేదిక జరుగుతున్న ఐపీఎల్ రెండో సీజన్ లో ఐదో మ్యాచ్ గురువారం ముంబై, కోల్ కతా మధ్య జరిగింది. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో ముంబై ఇండియన్స్ తన జట్టులో ఒక మార్పుచేసింది.
Also Read: IPL 2021: దేవుడిచ్చిన ప్రతిభను వృథా చేస్తున్నాడు: సంజు శాంసన్‌పై సన్నీ ఆగ్రహం
ముంబై 4వ స్థానంలో
ముంబై చివరిగా ఆడిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో తలపడింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. కేకేఆర్ తన చివరి మ్యాచ్ లో కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. రోహిత్ నాయకత్వంలోని ముంబై పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. కోల్ కతా 6వ స్థానంలో ఉంది.
Here's how the Points Table look after Match 33 of the #VIVOIPL 👇 #DCvSRH pic.twitter.com/rlyZREMzH9
— IndianPremierLeague (@IPL) September 22, 2021
Also Read: KKR vs MI Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 111-1, లక్ష్యం 156 పరుగులు