KKR vs MI Live Updates: 15.1 ఓవర్లలో మ్యాచ్ ముగించిన కోల్‌కతా.. ఏడు వికెట్లతో ముంబైపై విజయం
IPL 2021, Match 31, KKR vs MI: ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
LIVE
Background
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అద్భుతమైన విజయంతో ఐపీఎల్ రెండో దశను ఆరంభించింది కోల్‌కతా నైట్‌రైడర్స్. మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం చవిచూసింది ముంబయి ఇండియన్స్. అందుకే ముంబయి, కోల్‌కతా పోరుతో సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలోనే ముంబయి అత్యంత బలమైన జట్టు. రెండు సార్లు విజేతైన కోల్‌కతా పైనా వారిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 సార్లు తలబడితే రోహిత్ సేన ఏకంగా 22 సార్లు విజయ దుందుభి మోగించింది. చివరిసారి తలపడ్డ ఐదులో ఆఖరి నాలుగు మ్యాచుల్లో ముంబయి దుమ్మురేపింది. ప్రస్తుత మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. ఈ పోరులో గెలిస్తే ముంబయి 10 పాయింట్లతో పట్టికలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. ఇక 8 పాయింట్లతో ఉన్న కోల్‌కతా గెలిస్తే 10 పాయింట్లతో ముంబయిని వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి వెళ్తుంది.
ముంబయిలో ఆటగాళ్లకు తిరుగులేదు. రోహిత్‌శర్మ వస్తే ఆ జట్టుకు కొండంత బలం వస్తుంది. కానీ అతడి పిక్క కండరాల గాయం గురించి పూర్తి సమాచారం లేదు. ఇక హార్దిక్ పాండ్య తిరిగొస్తే జట్టు సమతూకం పెరుగుతుంది. చివరి మ్యాచులో బౌలింగ్‌లో బౌల్ట్, బుమ్రా ఆరంభంలో పరుగులు నియంత్రించినా ఆఖర్లో గతి తప్పారు. కానీ ముంబయి బ్యాటింగ్ విభాగం వరుణ్ చక్రవర్తిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.
కోల్‌కతా చివరి మ్యాచులో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉంది. ఓపెనింగ్‌లో శుభ్‌మన్‌కు వెంకటేష్ అయ్యర్ తోడయ్యాడు. నితీశ్ రాణా, రసెల్, మోర్గాన్, డీకే రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఇక బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు. అతడికి మరో స్పిన్నర్ సునిల్ నరైన్ తోడుగా ఉన్నాడు. రసెల్ బౌలింగ్‌లోనూ రాణిస్తుండటం కోల్‌కతాకు అనుకూలం.
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15.1 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 159-3, విజయం సాధించిన కోల్‌కతా
రోహిత్ శర్మ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే నితీష్ రాణా బౌండరీతో మ్యాచ్‌ను ముగించాడు.
రాహుల్ త్రిపాఠి 74(42)
నితీష్ రాణా 5(2)
రోహిత్ శర్మ 0.1-0-4-0
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 155-3, లక్ష్యం 156 పరుగులు
బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ ఎనిమిది పరుగులు చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 155-3గా ఉంది. విజయానికి 30 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఇయాన్ మోర్గాన్ అవుటయ్యాడు.
రాహుల్ త్రిపాఠి 74(42)
నితీష్ రాణా 1(1)
బుమ్రా 4-0-43-3
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 147-2, లక్ష్యం 156 పరుగులు
ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ రెండు పరుగులు మాత్రమే చేశారు. 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 147-2గా ఉంది. విజయానికి 36 బంతుల్లో 9 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 67(38)
ఇయాన్ మోర్గాన్ 7(7)
ఆడం మిల్నే 3-0-34-0
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 145-2, లక్ష్యం 156 పరుగులు
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 17 పరుగులు చేశారు. 13 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 145-2గా ఉంది. విజయానికి 42 బంతుల్లో 11 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 55(31)
ఇయాన్ మోర్గాన్ 0(2)
రాహుల్ చాహర్ 3-0-34-0
కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 128-2, లక్ష్యం 156 పరుగులు
బుమ్రా వేసిన ఈ ఓవర్లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ 11 పరుగులు చేశారు. 12 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు 128-2గా ఉంది. విజయానికి 48 బంతుల్లో 28 పరుగులు కావాలి.
రాహుల్ త్రిపాఠి 55(31)
ఇయాన్ మోర్గాన్ 0(2)
బుమ్రా 3-0-17-0