IPL 2021 Live Updates: ముంబైపై 20 పరుగులతో చెన్నై విజయం
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అయిపోయింది. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తొలిపోరులో ఢీకొంటున్నాయి.
LIVE
Background
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండో దశ మరికొన్ని నిమిషాల్లో మొదలవుతోంది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు తొలిపోరులో ఢీకొంటున్నాయి.
ప్రస్తుతం చెన్నైతో పోలిస్తే ముంబయి కాస్త బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. డికాక్, సూర్య, కిషన్, పొలార్డ్, హార్దిక్‌కు ఈ మధ్య మ్యాచ్ అనుభవం బాగానే దొరికింది. బుమ్రా, బౌల్ట్‌ల వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది.
చెన్నై పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ లోపాలు బయటపడ్డాయి. డుప్లెసిస్ ఇంకా కోలుకోలేదు. డ్వేన్ బ్రావో ఫిట్‌నెస్‌తో ఉన్నా ఏ స్థాయిలో ఆడతాడో చెప్పలేం. క్వారంటైన్ కారణంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ అందుబాటులో లేడు. రుతురాజ్ గైక్వాడ్‌తో ఓపెనింగ్‌కు ఎవరొస్తారో తెలియదు. మిడిలార్డర్లో ఎవరు విఫలమైనా ధోనీపై ఒత్తిడి తప్పదు. బౌలింగ్ విభాగంలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే ఇబ్బందులు తప్పనిసరి.
ఐపీఎల్‌లో చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడగా 19 సార్లు ముంబయి, 12 సార్లు చెన్నై గెలిచాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో రోహిత్‌సేన ఏకంగా నాలుగుసార్లు గెలవడం విశేషం. ఈ సీజన్ తొలిదశలో మే 1వ తేదీన ధోనీసేనతో తలపడ్డ పోరులో ముంబయి 219 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్ల తేడాతో ఛేదించింది.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 133-6, 20 పరుగులతో చెన్నై విక్టరీ
డ్వేన్ బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ మూడు పరుగులు సాధించారు. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 136-8 మాత్రమే చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులతో గెలుపొందారు.
సౌరవ్ తివారీ 50(40)
జస్‌ప్రీత్ బుమ్రా 1(2)
ఆడం మిల్నే అవుట్
డ్వేన్ బ్రేవో బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆడం మిల్నే కృష్ణప్ప గౌతం చేతికి చిక్కాడు
ఆడం మిల్నే (సి) కృష్ణప్ప గౌతం (బి)డ్వేన్ బ్రేవో (15, 15 బంతుల్లో, ఒక సిక్సర్)
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 19 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 133-6, లక్ష్యం 157 పరుగులు
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 15 పరుగులు సాధించారు. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 133-6గా ఉంది. విజయానికి 6 బంతుల్లో 24 పరుగులు కావాలి.
సౌరవ్ తివారీ 48(38)
ఆడం మిల్నే 15(14)
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 18 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 118-6, లక్ష్యం 157 పరుగులు
దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ 10 పరుగులు సాధించారు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 118-6గా ఉంది. విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు కావాలి.
సౌరవ్ తివారీ 43(36)
ఆడం మిల్నే 7(10)
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్: 17 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోరు 108-6, లక్ష్యం 157 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో ముంబై బ్యాట్స్‌మన్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగారు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 108-6గా ఉంది.
సౌరవ్ తివారీ 35(32)
ఆడం మిల్నే 5(8)