INDW vs ENGW Toss: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ - బౌలింగ్‌కే మొగ్గు!
మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ భారత్‌కు ఎంతో కీలకం. గ్రూప్-బిలో ప్రస్తుతం ఇంగ్లండ్ మొదటి స్థానంలోనూ, భారత్ రెండో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే టాప్-ప్లేస్‌కు చేరుకుంటుంది.
ఇంగ్లండ్ మహిళలు (ప్లేయింగ్ XI)
సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్
భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్ః
ఈ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో ఏడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓ మోస్తరు ఆరంభం లభించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (33: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు), యస్తిక భాటియా (17: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించారు. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంథన స్థానంలో జట్టులోకి వచ్చిన యస్తిక భాటియా కొంచెం ఇబ్బంది పడినట్లు కనిపించింది.
యస్తిక భాటియా అవుటైన కాసేపటికే షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ (16: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా అవుటయ్యారు. అయితే జెమీమా రోడ్రిగ్జ్ (53 నాటౌట్: 38 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు), రిచా ఘోష్ (31 నాటౌట్: 20 బంతుల్లో, ఐదు ఫోర్లు) మరో వికెట్ పడకుండానే మ్యాచ్‌ను ముగించారు. చివరి నాలుగు ఓవర్లలో టీమిండియా విజయానికి 41 పరుగులు అవసరం కాగా, వీరిద్దరూ కేవలం మూడు ఓవర్లలోనే ఛేదించారు. ఈ క్రమంలోనే జెమీమా రోడ్రిగ్జ్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. అనంతరం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆరు వికెట్లతో విజయం సాధించింది.
ఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంథనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. మహిళల ఐపీఎల్‌లో ఇదే అత్యధికం. స్మృతి మంథన తర్వాతి స్థానంలో రూ.3.2 కోట్లతో యాష్లే గార్డ్‌నర్ నిలిచింది. యాష్లే గార్డ్‌నర్‌ను గుజరాత్ దక్కించుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను రూ.1.8 కోట్లతో ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీని రూ.1.7 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.