అన్వేషించండి

Sports Year Ender 2024: పారిస్ ఒలింపిక్స్‌లో మెరిసిన భారత ప్లేయర్లు - మనూ భాకర్‌కి రెండు పతకాలు, 6 పతకాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లు

Paris Olympics: ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. మొత్తం ఆరు పతకాలతో ఆకట్టుకున్నారు. 

Flashback 2024: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ ఈ ఏడాది జరిగింది. పారిస్‌లో జరిగిన ఈ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఆరు పతకాలు సాధించారు. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలున్నాయి. జూలై 26 నుంచి ప్రారంభమైన ఈ మెగాటోర్నీలో ఏడుగురు రిజర్వ్ ఆటగాళ్లతో కలిపి 117 మంది ఆటగాళ్లను భారత్.. పారిస్‌కు పంపింది. అలాగే వాళ్లతో పాటు 140 మంది సహాయక సిబ్బంది, అధికారులు కూడా వెళ్లారు. 

సత్తా చాటిన మనూ భాకర్..
ఇక జూలై 28న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మనూ భాకర్ కాంస్యం సాధించింది. ఈ పోటీలో మూడో స్థానంలో నిలిచి మెడల్ కైవసం చేసుకుంది. ఒలింపిక్ షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 10 మి. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో కాంస్యం గెలిచింది. దీంతో షూటింగ్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్ సత్తా చాటింది. టీమ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి పతకం సాధించింది. పతక పోరులో దక్షిణ కొరియాను ఓడించింది. 

అదర గొట్టిన కుసాలే..
ఇక పురుషుల షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసాలే భారత్‌కు మూడో పతకాన్ని అందించాడు. పురుషుల 50 మి. రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని పొందాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా స్వప్నిల్ నిలిచాడు. నిజానికి ఈ విభాగంలో పతకం ఆశలు లేకపోయినప్పటికీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పతకాన్ని దక్కించుకున్నాడు. 

కాంస్య పతకాన్ని నిలబెట్టుకున్న భారత్..
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి 41 సంవత్సరాల పతక కరువును తీర్చిన భారత జట్టు.. ఈ ఎడిషన్‌లోనూ మళ్లీ కాంస్య పతకాన్ని సాధించింది. నిజానికి భారత ఆటతీరును బట్టి, బంగారు పతకాన్ని సాధిస్తుందని అనిపించింది. కానీ బ్యాడ్ లక్ వెంటాడటంతో కాంస్యానికే పరిమితమైంది. పతక పోరులో స్పెయిన్‌ను సునాయాసంగా ఓడించింది. 

నీరజ్ చోప్రా.. సిల్వర్ త్రో..
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి సంచలనం రేకెత్తించిన నీరజ్ చోప్రా.. మళ్లీ అదే ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. 89.45 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానాన్ని దక్కించుకుని, సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ సాధించిన ఏకైక సిల్వర్ మెడల్ ఇదే కావడం విశేషం. 
ఇక చివరగా పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల ఈవెంట్లో అమన్ సెహ్రావత్ కాంస్యాన్ని సాధించాడు. ఆగస్టు 9న జరిగిన ఈ పోరులో ప్యూర్టొరికో ప్లేయర్‌ను ఓడించి పతకాన్ని దక్కించుకున్నాడు. రెజ్లింగ్ విభాగంలో భారత్ సాథించిన ఏకైక పతకం ఇదే కావడం విశేషం. మరోవైపు వినేశ్ ఫోగట్.. తన విభాగంలో ఫైనల్‌కు చేరినా, బరువు సమస్యతో డిస్ క్వాలిఫై అయింది.  

Also Read: Virat Kohli  Record: సచిన్ సరసన కోహ్లీ, ఎలైట్ క్లబ్ లోకి ప్రవేశం- ఆసీస్ పై ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఘనత 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Embed widget