IND vs WI: విరాట్ ఊపు తీసుకొస్తే.. రోహిత్ ప్రశాంతత తెస్తాడన్న మాజీ ఆల్‌రౌండర్
విరాట్ కెప్టెన్సీ నుంచి దిగిపోయినప్పటికీ జట్టులో ఉన్నంత వరకు అతడు నాయకుడేనని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ టీమ్‌ఇండియాకు ఉత్సాహం తీసుకొస్తే రోహిత్ శర్మ ప్రశాంతతను తీసుకొస్తాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. విరాట్ కెప్టెన్సీ నుంచి దిగిపోయినప్పటికీ జట్టులో ఉన్నంత వరకు అతడు నాయకుడేనని పేర్కొన్నాడు. ప్రస్తుత కెప్టెన్‌కు అతడు కచ్చితంగా సలహాలు ఇస్తాడని వెల్లడించాడు.
'నిజమే, విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్ కాడు. కానీ జట్టులో ఉన్నన్ని రోజులు అతడు నాయకుడే. అందులో సందేహమే లేదు. అన్నీ సక్రమంగా జరిగేందుకు కొత్త కెప్టెన్‌కు అతడు సాయం చేస్తాడు' అని ఇర్ఫాన్ అన్నాడు.
'టీమ్‌ఇండియా ఫిట్‌నెస్‌కు విరాట్ కోహ్లీ మరో స్థాయికి చేర్చి సరైన సందేశమే పంపించాడు. కాలం గడిచే కొద్దీ అతడు కచ్చితంగా ఇతరులకు సాయం చేస్తాడు. ముఖ్యంగా రోహిత్ శర్మకు అండగా ఉంటాడు. ప్రతి కెప్టెన్ తనదైన ఫ్యాషన్లో జట్టుకు మేలు చేస్తాడు. కోహ్లీ ఉత్సాహంగా నడిపిస్తే రోహిత్ ప్రశాంతతను తీసుకొస్తాడు' అని ఇర్ఫాన్ వెల్లడించాడు.
టీమ్‌ఇండియా కెప్టెన్సీ వ్యవహారం దాదాపుగా సద్దుమణిగింది! ఇప్పుడిప్పుడే జట్టులో ప్రశాంతత వస్తోంది. కోహ్లీ తనదైన రీతిలో సాధన చేస్తున్నాడు. రోహిత్ ఫిట్‌నెస్ సాధించి జట్టు నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. వెస్టిండీస్ సిరీసుకు సిద్ధమవుతున్నాడు.
షెడ్యూలు ఇదే: ఫిబ్రవరి 6, 9, 11న మొతెరా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. 16, 18, 20న కోల్‌కతా వేదికగా టీ20లు నిర్వహిస్తారు. ఇందుకోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల క్వారంటైన్ తర్వాత సన్నాహక శిబిరం ఉంటుంది. ఆ తర్వాత మ్యాచులు మొదలవుతాయి.
టీమ్‌ఇండియా వన్డే జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్
Also Read: Sourav Ganguly: ఐపీఎల్ 2022 ఇక్కడే.. త్వరలో మహిళల ఐపీఎల్ కూడా.. గంగూలీ ఏమన్నారంటే?