By: ABP Desam | Updated at : 24 Feb 2022 09:00 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ishan-kishan
IND vs SL, 1st T20, Ekana Sports City:
శ్రీలంకతో మ్యాచులో టీమ్‌ఇండియా ఇరగదీసింది! పర్యాటక జట్టుకు 200 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. చిచ్చరపిడుగు, ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ (89; 56 బంతుల్లో 10x4, 3x6) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారీ అర్ధశతకంతో దుమ్మురేపాడు. అతడికి తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ (44; 32 బంతుల్లో 2x4, 1x6) దూకుడుగా ఆడాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (57*; 28 బంతుల్లో 2x4, 2x6) మెరుపులు మెరిపించాడు. లంకలో దసున్ శనక, లాహిరు కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
మొదట ఇషాన్ దంచుడు
విండీస్ సిరీసులో విఫలమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచులో రెచ్చిపోయాడు. తొలి 14 బంతుల్లో అతడు చేసింది 17 పరుగులే. ఆ తర్వాత మాత్రం లంకేయులకు చుక్కలు చూపించాడు. మరో 14 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. అతడు బాదిన సిక్సర్లు, బౌండరీలు చూస్తుంటే అందరికీ మజా వచ్చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదట్లో వేగంగా ఆడాడు. ఇషాన్ జోరు పెంచడంతో సెకండ్ ఫిడిల్ ప్లే చేశాడు. అందమైన బౌండరీలు బాదేస్తూనే పరుగులు సాధించాడు. వీరిద్దరూ విధ్వంసకరంగా ఆడటంతో తొలి వికెట్‌కు 111 పరుగులు వచ్చాయి. 12వ ఓవర్ ఆఖరి బంతికి రోహిత్‌ను లాహిరు బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది.
ఆఖర్లో శ్రేయస్ బాదుడు
రోహిత్ ఔటైన సంతోషం లంకేయులకు ఎక్కువ సేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. ఇషాన్‌తో పాటు అతడూ షాట్లు బాదేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సెంచరీకి చేరువైన కిషన్‌ను జట్టు స్కోరు 155 వద్ద దసున్ శనక ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (3) సహకారంతో శ్రేయస్ రెచ్చిపోయాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరును 199కి చేర్చాడు. ఈ మ్యాచులో రోమిత్ శర్మ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
Rohit Sharma departs after scoring a fine 44.
— BCCI (@BCCI) February 24, 2022
He is now the Top run-getter in Men's T20Is 🔝
Follow the match ▶️ https://t.co/RpSRuIlfLe #INDvSL | @Paytm pic.twitter.com/8Bz2fjAXJ1
🇱🇰 won the toss and elected to field first. Chandimal and Vandersay IN for injured Mendis and Theekshana 🙌#INDvSL pic.twitter.com/BMnSG4mH5r
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 24, 2022
IND vs ENG, 1st Innings Highlights: ఇంగ్లండ్‌పై ‘పంతం’ - మొదటిరోజు భారత్‌దే!
IND vs ENG 5th Test Tea Break: పోరాడుతున్న పంత్, జడేజా - టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు ఎంతంటే?
MS Dhoni Treatment: ధోనీకి మోకాళ్ల నొప్పులు! ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఛాంపియన్!
IND vs ENG 5th Test: ఆడకూడని బంతులకు ఓపెనర్లు ఔట్ - లంచ్‌కు టీమ్‌ఇండియా 53-2
IND vs ENG 5th Test: బెన్‌స్టోక్స్‌దే టాస్ లక్! తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్