IND Vs SA, 2nd Test: భారత్‌కు ‘షార్ట్’ కష్టాలు.. చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. స్కోర్ ఎంతంటే?
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (13 బ్యాటింగ్: 32 బంతుల్లో, ఒక ఫోర్), రవిచంద్రన్ అశ్విన్ (24 బ్యాటింగ్: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ సెషన్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో నిలదొక్కుకున్న హనుమ విహారి (20: 53 బంతుల్లో, మూడు ఫోర్లు), కేఎల్ రాహుల్ (50: 133 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) అవుటయ్యారు.
53-3తో రెండో సెషన్ ప్రారంభించిన భారత్‌కు మంచి ఆరంభమే లభించింది. విహారి, కేఎల్ రాహుల్ మూడో వికెట్‌కు 42 జోడించిన అనంతరం 91 పరుగుల వద్ద హనుమ విహారిని అవుట్ చేసి రబడ దక్షిణాఫ్రికాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. రబడ వేసిన షార్ట్ పిచ్ బంతిని విహారి డిఫెండ్ చేయబోగా బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఉన్న వాన్ డెర్ డసెన్ ఎడమ పక్కకి గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో విహారి వెనుదిరగక తప్పలేదు.
విహారి అవుటయ్యాక పంత్ క్రీజులోకి వచ్చాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం కేఎల్ రాహుల్ కూడా మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి రబడ చేతికి చిక్కాడు. దీంతో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ ముగించారు. ఈ సెషన్‌లో పడ్డ రెండు వికెట్లూ షార్ట్ పిచ్ బంతులకే పడ్డాయి.
అంతకుముందు మొదటి సెషన్‌లో కూడా భారత బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. పిచ్ కాస్త భిన్నంగా ఉండటం, ఊహించని రీతిలో బంతి బౌన్స్ అవుతుండటం టీమ్‌ఇండియాను బాగా ఇబ్బంది పెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ (26: 37 బంతుల్లో ఐదు ఫోర్లు) తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. చతేశ్వర్ పుజారా (3: 33 బంతుల్లో), అజింక్య రహానె (0: 1 బంతి) మరోసారి విఫలం అయ్యారు. వీరిద్దరినీ ఒలివియర్ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు.
Tea on day one in Johannesburg ☕️
— ICC (@ICC) January 3, 2022
South Africa keep up the pressure scalping two important wickets of KL Rahul and Hanuma Vihari.
Watch #SAvIND live on https://t.co/CPDKNx77KV (in select regions) 📺#WTC23 | https://t.co/BCpTa2JF2P pic.twitter.com/3n8DaYxfpr
That will be Tea on Day 1 of the 2nd Test.#TeamIndia 146/5
— BCCI (@BCCI) January 3, 2022
Scorecard - https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/4IRbSxBxdq
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు