![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs SA, 2nd Test: వాండరర్స్‌లో విలవిల! లంచ్‌కు టీమ్‌ఇండియా @ 51/3
తమకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. వాండరర్స్ టెస్టులో టీమ్‌ఇండియా విలవిల్లాడుతోంది! కేవలం 26 ఓవర్లలో 53 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి అల్లాడుతోంది!
![IND vs SA, 2nd Test: వాండరర్స్‌లో విలవిల! లంచ్‌కు టీమ్‌ఇండియా @ 51/3 IND vs SA 2nd Test, At Lunch the Team India are in trouble as they are at 51/3 IND vs SA, 2nd Test: వాండరర్స్‌లో విలవిల! లంచ్‌కు టీమ్‌ఇండియా @ 51/3](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/05/caebfabd6d46c51a68c425f746e61203_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వాండరర్స్ టెస్టులో టీమ్‌ఇండియా విలవిల్లాడుతోంది! కేవలం 26 ఓవర్లలో 53 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి అల్లాడుతోంది! తమకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో సఫారీ బౌలర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (19; 74 బంతుల్లో 4x4), హనుమ విహారి (4; 12 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరూ భారీ భాగస్వామ్యం నెలకొల్పితేనే టీమ్‌ఇండియా గట్టెక్కుతుంది.
Lunch on Day 1 of the 2nd Test.#TeamIndia 53/3
— BCCI (@BCCI) January 3, 2022
Scorecard - https://t.co/qcQcovZ41s #SAvIND pic.twitter.com/ylJ5vwOfuE
విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కాస్త భిన్నంగా ఉండటం, ఊహించని రీతిలో బంతి బౌన్స్ అవుతుండటం టీమ్‌ఇండియాను ఇబ్బంది పెట్టింది. అయినప్పటికీ 14 ఓవర్ల వరకు ఓపెనర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ (26; 37 బంతుల్లో 5x4) తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం అందించారు.
Lunch on day one in Johannesburg 🍲
— ICC (@ICC) January 3, 2022
A disciplined bowling performance from the hosts.
Watch #SAvIND live on https://t.co/CPDKNx77KV (in select regions) 📺#WTC23 | https://t.co/BCpTa2JF2P pic.twitter.com/s1kQI8LqGH
15వ ఓవర్ తొలి బంతికి మయాంక్‌ను జెన్‌సన్ ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. చెతేశ్వర్ పుజారా (3; 33 బంతుల్లో) మరోసారి విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (0; 1 బంతుల్లో) సైతం ఆదుకోలేదు. వీరిద్దరినీ జట్టు స్కోరు 49 వద్ద ఒలీవర్ ఓకే ఓవర్లో ఔట్ చేశాడు.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)