Watch Video: అశ్విన్‌కు ఎడ్జ్ చేయడం నేర్పించిన అక్షర్..!
కివీస్‌తో మూడో రోజు ఆట ముగిశాక అక్షర్ పటేల్, కేఎస్ భరత్‌ను అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. బ్యాటర్లను ఎలా ఎడ్జ్ చేశాడో పటేల్‌ను అడిగి తెలుసుకున్నాడు.
టీమ్‌ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సలహాలు ఇస్తున్నాడు యువ ఆటగాడు అక్షర్ పటేల్! బ్యాటర్లు ఎడ్జ్ అయ్యేందుకు ఏం చేయాలో వివరించాడు. ఆట ముగిసిన తర్వాత అక్షర్, కోన భరత్‌ను యాష్ ఇంటర్వ్యూ చేశాడు.
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమ్‌ఇండియా స్పి్న్నర్లు అద్భుతం చేశారు. గింగారాలు తిరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. ఇక యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రత్యర్థులను వణికించాడు. లో బౌన్స్ బంతులు వేసి ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇక యాష్ 3 వికెట్లు తీశాడు. దాంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో కొంత ఆధిక్యం లభించింది.
Special: @ashwinravi99 takes centre stage to interview Mr. Fifer @akshar2026 & Super sub @KonaBharat. 👏
— BCCI (@BCCI) November 27, 2021
You don't want to miss this rendezvous with the #TeamIndia trio after Day 3 of the Kanpur Test. 👌- By @28anand
Full interview 🎥 ⬇️ #INDvNZ @Paytm https://t.co/KAycXfmiJG pic.twitter.com/jZcAmU41Nf
మూడో రోజు ఆట ముగిసిన తర్వాత అక్షర్, భరత్‌ను యాష్ ఇంటర్వ్యూ చేశాడు. బ్యాటర్ల బ్యాటు అంచులకు తగిలి క్యాచులిచ్చేలా ఎలా బంతులు వేశావో చెప్పాలని అక్షర్‌ను కోరాడు. తనకెందుకు అది సాధ్యం కాలేదో తెలుసుకోవాలని ఉందన్నాడు. 'నువ్వు వేసే బంతులు బాగా టర్న్ అయ్యి బీట్ అవుతాయి. నేను వేసే బంతులు ఎక్కువగా తిరగవు. దాంతో బ్యాటు అంచులకు తగులుతున్నాయి' అని పటేల్ వివరించాడు.
వృద్ధిమాన్ సాహాకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విశాఖ కుర్రాడు కోన్ శ్రీకర్ భరత్‌పై యాష్, అక్షర్ ప్రశంసలు కురిపించారు. అతడు అద్భుతంగా కీపింగ్ చేశాడని వెల్లడించారు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులనూ క్యాచులు పట్టాడని యాష్ అన్నాడు. అతడితో కలిసి నాలుగేళ్లు క్లబ్ క్రికెట్ ఆడానని, బంతులు పట్టుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
Also Read: IND vs NZ Kanpur Test: యాష్ నువ్వే భేష్..! బ్యాటర్ల బుర్రల్లో చిక్కుముళ్లు వేశావన్న వెటోరీ
Also Read: Kapil Dev: ముందు పాండ్యను బౌలింగ్ చేయనివ్వండి..! నా వరకైతే అశ్వినే మెరుగైన ఆల్‌రౌండర్
Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?
Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్ ప్లేయర్
Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి