IND vs NZ 3rd T20: వైట్‌వాష్‌పై హిట్‌మ్యాన్ సేన గురి! అరంగేట్రానికి రుతురాజ్, అవేశ్ రెడీ
కివీస్ పై 2-0తో సిరీసు కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వైట్‌వాష్‌పై కన్నేసింది. అలా జరగనీయొద్దని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్‌లో ఎవరి బలమేంటి?
![IND vs NZ 3rd T20: వైట్‌వాష్‌పై హిట్‌మ్యాన్ సేన గురి! అరంగేట్రానికి రుతురాజ్, అవేశ్ రెడీ IND vs NZ 3rd T20 Team India eyes on whitewash against New Zealand in 3rd t20 match preivew playing eleven IND vs NZ 3rd T20: వైట్‌వాష్‌పై హిట్‌మ్యాన్ సేన గురి! అరంగేట్రానికి రుతురాజ్, అవేశ్ రెడీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/ae870e358424ffde78bffb2439081fb6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సిరీసులో ఆఖరిదైన మూడో టీ20కి ఈడెన్ గార్డెన్ ముస్తాబైంది. రెండున్నరేళ్ల తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. అందుకే 2-0తో సిరీసు కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వైట్‌వాష్‌పై కన్నేసింది. అలా జరగనీయొద్దని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. మరి మ్యాచ్‌లో ఎవరి బలమేంటి? కొత్త కుర్రాళ్లలో ఎవరు అరంగేట్రం చేయబోతున్నారు?
రుతురాజ్ రెడీ
సిరీసును కైవసం చేసుకోవడంతో టీమ్‌ఇండియాపై ఒత్తిడి లేదు. గెలుపోటములను పక్కనపెట్టి ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్, అవేశ్ ఖాన్ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. సీఎస్‌కేలో గైక్వాడ్ పరుగుల వరద పారిస్తే డీసీలో అవేశ్ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అరంగేట్రంలోనే అదరగొట్టిన హర్షల్ పటేల్‌పై అంచనాలు పెరిగిపోయాయి. రోహిత్, కేఎల్, పంత్ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. వెంకటేశ్ అయ్యర్‌కు తన ఫైర్‌పవర్ చూపే అవకాశం ఇంకా దొరకలేదు. యాష్, అక్షర్ జోడీకి తిరుగులేదు.
మార్పులేం లేవు
సిరీసులో వైట్‌వాష్ కావొద్దని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఆటగాళ్లు కసితో ఆడే అవకాశం ఉంది. మార్టిన్ గప్తిల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, ఛాప్‌మన్ ఫామ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ స్థాయికి తగ్గట్టు బంతులు వేస్తున్నా కాపాడుకోగల స్కోరు బ్యాటర్లు చేయలేదు. పైగా టాస్ ఓడిపోవడం వారిని వెనకబడేలా చేసింది. జట్టులో మరీ మార్పులేమీ ఉండకపోవచ్చు. మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి మరింత బాగా బౌలింగ్ చేయాల్సి ఉంది. ఈడెన్ పిచ్ కివీస్ బౌలింగ్‌కు నప్పడం సానుకూల అంశం.
బంతి, బ్యాటుకు పోటీ
ఈడెన్ గార్డెన్ పేస్, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. బౌన్స్ ఉంటుంది కాబట్టి పేసర్లే కాకుండా స్పిన్నర్లూ వికెట్లు తీయగలరు. ఫ్లాట్ పిచ్ కావడంతో బ్యాటర్లు పరుగుల వరద పారించేందుకు అవకాశం ఉంటుంది. కోల్‌కతా వాతావరణం బాగుంది. 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మంచు కీలకం అవుతుంది.
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)