IND vs NZ 3rd T20: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టేందుకు హిట్‌మ్యాన్ సై.. సై!
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ శర్మ ఉత్సాహంగా ఉన్నాడు. కోల్‌కతా మ్యాచులో హిట్‌మ్యాన్ హిట్టైతే విరాట్‌ను దాటేయడం ఖాయం!
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టనున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడో టీ20లో అతడు మరో 87 పరుగులు చేస్తే చాలు. భారత్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు.
న్యూజిలాండ్ సిరీసులో రోహిత్ శర్మ 103 పరుగులు చేశాడు. పొట్టి క్రికెట్లో 118 మ్యాచుల్లోనే 3141 పరుగులు చేశాడు. భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అతకన్నా ముందు విరాట్ కోహ్లీ 3227తో ఉన్నాడు. హిట్‌మ్యాన్ మరో 87 పరుగులు చేస్తే అతడి రికార్డు బద్దలవుతుంది.
ఇక అంతర్జాతీయంగా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్ గప్తిల్ ముందున్నాడు. అతడు కేవలం 107 ఇన్నింగ్సుల్లోనే 3248 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాతో రెండో మ్యాచులో 17 బంతుల్లోనే 31 పరుగులు చేయడంతో ఈ ఘనత అందుకున్నాడు. విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఇక మూడో స్థానంలో రోహిత్ ఉన్నాడు.
భారత్, న్యూజిలాండ్ నేడు మూడో టీ20లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతోంది. రోహిత్ శర్మకు ఇది అచ్చొచ్చిన మైదానం. అతడు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసింది ఇక్కడే. మరి నేటి మ్యాచులో హిట్‌మ్యాన్ హిట్టైతే కోహ్లీనే కాదు గప్తిల్ స్కోరునూ దాటేందుకు అవకాశాలు లేకపోలేదు.
WHAT. A. WIN! 👏 👏#TeamIndia secure a 7⃣-wicket victory in the 2nd T20I against New Zealand & take an unassailable lead in the series. 👍 👍 #INDvNZ @Paytm
— BCCI (@BCCI) November 19, 2021
Scorecard ▶️ https://t.co/9m3WflcL1Y pic.twitter.com/ttqjgFE6mP
Also Read: Ind vs NZ, 2nd T20, Highlights: RRRకు తొలి విజయం.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచేసిన టీమిండియా!
Also Read: WATCH: సెక్యూరిటీ దాటుకొని రోహిత్ పాదాలను తాకిన రాంచీ అభిమాని..!
Also Read: Daniel Vettori: బుమ్రాతో పటేల్ కలిశాడంటే..! టీమ్‌ఇండియాను ఎవ్వరేం చేయలేరు అంటున్న వెటోరీ
Also Read: MS Dhoni IPL update: ఐపీఎల్ 2022 ధోనీ ఆడతాడా? ఆడడా? మళ్లీ మొదలైన రచ్చ..!
Also Read: MSD on IPL: సంవత్సరమా.. ఐదేళ్లా.. ఐపీఎల్ కెరీర్‌పై ధోని ఏమన్నాడంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి